తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao), వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) పై తీవ్ర విమర్శలు చేశారు. తన ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవీకాలంలో రాష్ట్ర భవిష్యత్తుకు తీవ్ర నష్టం కలిగించారని ఆరోపించారు. ఐటీ, పరిశ్రమల రంగంలో రాష్ట్రానికి వచ్చే అవకాశాలను జగన్ పూర్తిగా తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు.

దిగ్గజ కంపెనీల రాకను అడ్డుకుంటున్న వైసీపీ?
పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) వెల్లడించిన వివరాల ప్రకారం, టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థలు (IT organizations) ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, అయితే వైసీపీ నేతలు అవి రావకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి అవకాశాలు అందుతున్న నేపథ్యంలో, వాటిని అడ్డుకునే ప్రయత్నాలు సైతం చేస్తున్నారని పేర్కొన్నారు.
“పిల్ల సైకోల దుష్ప్రచారం”.. తీవ్ర వ్యాఖ్యలు
వైసీపీ తరపున వస్తున్న విమర్శలు, దుష్ప్రచారాన్ని “పిల్ల సైకోల తంత్రాలు”గా అభివర్ణించిన పల్లా, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మితిమీరాయని ధ్వజమెత్తారు. అభివృద్ధికి అడ్డుగా ఉన్న వారి ఆలోచనా ధోరణిని ప్రజలు తిప్పికొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కుంభకోణాల నుండి దృష్టి మళ్లించేందుకు కుట్రలు?
తమ పాలనలో జరిగిన అవినీతిని ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పల్లా అన్నారు. గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇది చేస్తున్న కుట్రల శ్రేణి అని ఆయన విమర్శించారు. ప్రజలు చెప్పినా వీళ్ల బుద్ధి మారడం లేదని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి-సంక్షేమం చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Indrakeeladri: కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు..ఎప్పటినుండంటే?