ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) పరిపూర్ణతనిచ్చే ప్రకృతి అందాల్లో కొల్లేరు సరస్సు ఒకటి. పక్షుల అభయారణ్యంగా పేరు పొందిన ఈ సరస్సు కాలుష్యం నుండి నివారిద్దాం. తాజాగా విజయవాడలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా. పి. కృష్ణయ్య (P. Krishnaiah) ఈ విషయాన్ని తీవ్రంగా ప్రస్తావించారు.

మ్యాపింగ్, పరిశీలన, నివేదికలు:
సరస్సుకు సంబంధించిన పరివాహక ప్రాంతాలను తక్షణమే మ్యాపింగ్ చేయాలని, అక్కడి నిక్షేపాలను అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని డా. కృష్ణయ్య హైలైట్ చేశారు. చుట్టుపక్కల గ్రామాల వారు కొల్లేరులో వ్యర్థాలు వేయకుండా, పరిశ్రమల నుంచి మురుగు నీరు వదలకుండా ఆయా శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కొల్లేరు పరీవాహక ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయించడంతో పాటు, అధికారుల బృందాన్ని ఆ ప్రాంతానికి పంపి అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించారు.
ప్రజా చైతన్యం, మౌలిక సదుపాయాలు:
పరిసర గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించడం కీలకమని పేర్కొంటూ, “చెత్త పక్కన పారేయడం సమస్య కాదు అది సరస్సులోకి చేరుతుందన్నది అసలు ప్రమాదం” అని అన్నారు. కొల్లేరులో ఎక్కడెక్కడి నుంచి డ్రెయిన్స్ వచ్చి కలుస్తున్నాయో గుర్తించాలని, తక్షణమే వాటిని శుద్ధి చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కొల్లేరు పరీవాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే అందుకు సంబంధించిన మెకానిజంతో కాలుష్య వ్యర్థాలను తొలగించమని ఆయన సూచించారు.
“కొల్లేరు మనకే కాదు భవిష్యత్తు తరాలకు సైతం జీవనాధారంగా నిలవాలి. కాలుష్యం నుంచి దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత” అని పేర్కొన్న డా. పి. కృష్ణయ్య, ఈ ఉద్యమాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Read also: PSR Anjaneyulu: ఆంజనేయులుకు హైకోర్టులో లభించని ఊరట
AP journalist : ఆధారాలున్నాయంటూ బుద్ధి మార్చుకోని జర్నలిస్ట్ కృష్ణంరాజు..