విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధు (Rajapu Sidhu, an intermediate student) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సాంకేతికతపై ఆసక్తితో పాటు పాఠశాలలో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని కలిపి కేవలం రూ.35 వేల ఖర్చుతో ఓ ఎలక్ట్రిక్ సైకిల్ (electric cycle)ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు.జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధు, పాఠశాల రోజులలో ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ ద్వారా సైన్స్, టెక్నాలజీపై ఆసక్తి పెంచుకున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతూ చాట్‌జీపీటీ, గూగుల్ వంటి వనరులు ఉపయోగించి, ఈ-సైకిల్ తయారీకి కావాల్సిన సమాచారం అందుకున్నాడు. తన స్నేహితుడు రాజేశ్‌తో కలిసి భాగస్వామిగా వ్యవహరిస్తూ, మార్కెట్ నుంచి రూ.35 వేల విలువైన పరికరాలు కొనుగోలు చేసి సొంతంగా ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారుచేశాడు.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణం
ఈ ఈ-సైకిల్ పనితీరు ఆశ్చర్యం కలిగించేదే. మూడున్నర గంటల ఛార్జింగ్‌తో ఇది గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో 80 కిలోమీటర్ల దూరం (80 kilometers at a speed of 50 kilometers) ప్రయాణించగలదు. చార్జింగ్ అయిపోయినా, సాంప్రదాయ సైకిల్‌లా తొక్కుకోవచ్చు. ఈ సైకిల్ వల్ల కాలేజీకి వేయే గాలి, పొగతో సంబంధం లేకుండా తాను నిత్యం దీనిపైనే ప్రయాణిస్తున్నానని సిద్ధు చెబుతున్నాడు.
పరిసర గ్రామాల ప్రజల నుంచి అభినందనలు
తన ఆవిష్కరణ చూసిన గ్రామస్థులు, తోటి విద్యార్థులు సిద్ధును అభినందిస్తున్నారు. “ఇదే ఇలాగే ముందుకు సాగితే మరిన్ని వినూత్న ఆవిష్కరణలు చేయగలను” అనే నమ్మకంతో సిద్ధు ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే కొన్ని కుటుంబాలు తమ పిల్లల కోసం ఇలాంటి సైకిళ్లు తయారు చేయమని అభ్యర్థించారట.
కళలు ఉన్నవారికి వేదికలెన్నో
సిద్ధు చేసిన ఈ సైకిల్ యువతకు స్పూర్తిగా మారుతోంది. పట్టుదల, ఆసక్తి ఉంటే ప్రతిఒక్కరూ మంచి ఆవిష్కర్తలుగా ఎదగవచ్చని అతడి ప్రయోగం మరోసారి నిరూపిస్తోంది.
Read Also : AP DSC : జులై 1, 2 తేదీల్లో డీఎస్సీ పరీక్ష రాసేవారికి అప్ డేట్