తెలుగు గర్వంగా భావించే పేరు కోనేరు హంపీ (Koneru Humpy). ఈసారి ఆమె ఒక రికార్డు సృష్టించారు. ఫిడే మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కు చేరిన తొలి భారత మహిళగా చరిత్రలో నిలిచారు. చెస్ బోర్డుపై ఆమె చూపిన అద్భుత నైపుణ్యం దేశమంతా గర్వించేలానే చేసింది.హంపీ విజయంతో భారత చెస్‌కు గర్వకారణం ఏర్పడింది. ఐఎం యుక్సిన్ సాంగ్‌పై ఆమె ఆటతీరు చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ప్రత్యేకంగా ఆమె ప్రదర్శించిన కౌంటర్ అటాక్ చాలామందికి స్ఫూర్తి నిచ్చింది. ఓర్పుతో, వ్యూహాత్మకంగా ఆడిన హంపీ తీరుపై అభిమానులు ముచ్చటపడుతున్నారు.

ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హంపీపై ప్రశంసల వర్షం కురిపించారు. “మన తెలుగు అమ్మాయి ప్రపంచ స్థాయిలో వెలుగుతుంటే మాకు గర్వంగా ఉంది. హంపీ విజయంతో దేశం అంతా గర్విస్తోంది. ఇది చాలా మందికి ప్రేరణ కలిగించే ఘట్టం. ఆమె భవిష్యత్తు మరింత ఉండాలని ఆకాంక్షిస్తున్నాం” అని ఆయన ట్వీట్ చేశారు.
స్ఫూర్తిదాయకంగా హంపీ ఆట: మంత్రి లోకేశ్ ప్రశంస
డిజిటల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా హంపీ విజయాన్ని ప్రత్యేకంగా అభినందించారు. “చెస్‌లో భారత మహిళలకు ఇది చారిత్రక మైలురాయి. హంపీ ఐఎం యుక్సిన్ సాంగ్‌పై చూపిన ఆత్మస్థైర్యం, వ్యూహం అద్భుతం. ఆమె నైపుణ్యం ప్రతి యువ ఆటగాడికి స్ఫూర్తి. సెమీఫైనల్‌లో విజయం సాధించి టైటిల్ అందుకోవాలని కోరుకుంటున్నాం” అని వ్యాఖ్యానించారు.కోనేరు హంపీ సాధించిన ఈ ఘనత భారత మహిళల క్రీడా ప్రపంచంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. ఇది కేవలం ఒక విజయం కాదు. ఒకEntire generationకి మార్గదర్శకంగా నిలిచే ఘట్టం.
Read Also : Anderson- Tendulkar: తన పేరుతో ట్రోఫీ నిర్వహించడంపై జేమ్స్ అండర్సన్ ఏమన్నారంటే?