నందమూరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి(Late Chief Minister), గొప్ప నటుడు ఎన్.టి.రామారావు కుమారుడు నందమూరి జయకృష్ణ భార్య పద్మజ ఈ ఉదయం మరణించారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న వారి ఇంట్లో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు, బీజేపీ (BJP) నేత దగ్గుబాటి పురందేశ్వరి భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పద్మజ సోదరి. ఆమె మరణ వార్తతో నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

హైదరాబాద్ కి బయలుదేరిన చంద్రబాబు
పద్మజ మరణ వార్త తెలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu), ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి, పద్మజ భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి వారు అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.
ఈ వార్త తెలుసుకున్న నందమూరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఒక్కొక్కరుగా జయకృష్ణ ఇంటికి చేరుకుని పద్మజ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈ మరణంతో నందమూరి కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది.
పద్మజ ఎవరు?
ఆమె దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి.
ప్రస్తుతం నందమూరి కుటుంబంలో నెలకొన్న వాతావరణం ఎలా ఉంది?
ఆమె మృతితో నందమూరి కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది. బంధుమిత్రులు ఒక్కొక్కరుగా జయకృష్ణ నివాసానికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: