ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు త్వరలో ‘ఎన్టీఆర్ బేబీ కిట్'(NTR Baby Kits)లు అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం 2016లో ప్రారంభమై, ఒక దశలో నిలిచిపోయింది. అయితే, మళ్లీ దీనిని క్రియాశీలం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మాతృశిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
పిల్లలకు అవసరమైన 11 రకాల వస్తువులు
ఎన్టీఆర్ బేబీ కిట్‌లో మొత్తం 11 రకాల అవసరమైన వస్తువులు ఉండనున్నాయి. ఇందులో దోమతెరతో కూడిన పరుపు, శిశువులకు అవసరమైన దుస్తులు, నాప్కిన్లు, సబ్బు, పౌడర్, ఆయిల్, తల్లులకు ఉపయోగపడే కొన్ని సాధనాలు కూడా కలిపి ఉంటాయి. ఈ కిట్లు చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మంచి నాణ్యత కలిగిన పదార్థాలతో ఈ కిట్లు సిద్ధం చేయనున్నట్లు సమాచారం.
టెండర్ల ప్రక్రియ ప్రారంభం
ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఇప్పటికే టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో సరఫరాదారులను ఎంపిక చేసి ప్రభుత్వ ఆసుపత్రులకు కిట్లను అందించనున్నారు. త్వరలోనే ఈ కిట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లి, శిశు మరణాలను తగ్గించేందుకు ఇది ఉపయుక్తమవుతుందన్న నమ్మకంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.
Read Also : One Big Beautiful Bill : ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పై ట్రంప్ సంతకం