- బాబా ఆశీస్సులతో సాధించి తీరుతాం – సంస్థ ఎండి జగదీష్
శ్రీసత్యసాయి జిల్లా : భారత దేశంలోని రహదారుల నిర్మాణ రంగంలో గతంలో తాను నెలకొల్పిన గిన్నిస్ వరల్డ్ రికార్డును తిరిగి రాయడానికి రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేటు లిమిటెడ్ సోమవారం శ్రీకారం చుట్టినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జగదీష్ కదం తెలిపారు. నల్లమాడ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను జరుగుతున్న ప్రాంతంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం విజయవాడ (vijayawada) నుండి బెంగుళూరుకు వెళ్ళే గ్రీన్ ఫీల్డ్ హైవే ఎన్వాచ్ 544జి జాతీయ రహదారి నిర్మాణంలో ఈ నెల 05వ తేది నుండి 12వ తేది వరకు 7 రోజుల్లో 156 కిలోమీటర్ల సింగల్ లేన్ బిట్యూమినస్ రోడ్డును పూర్తీ చేసేందుకు సంసిద్ధమై సోమవారం తమ టీం మొత్తం పనులలో నిమగ్నమైందన్నారు.
Read also: MLC Kavitha: వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నా.. రాజకీయ శక్తిగా తిరిగొస్తా

Rajpat Infracom is heading towards another Guinness World Record
తాము వేస్తున్న ఈ రోడ్డు 11.5 మీరట్ల వెడల్పుతో మూడు లేన్ల రోడ్డుగా ఉంటుందని, ఈ మొత్తం దూరాన్ని సింగల్ లేన్ గా పరిగణిస్తూ మొత్తం 156 కిలోమీటర్ల సింగ్లోన్ రోడ్డు అవుతుందని వివరించారు. జాతీయ రహదారుల నిర్మాణాల యొక్క నిబంధనలను పాటిస్తూ అధికారుల సమక్షంలో రాత్రింబవుళ్ళు ఏ ఒక్క నిమిషం వృధా కాకుండా నాణ్యతతో కూడిన జాతీయరహదారి నిర్మాణంలో దాదాపు 600 మందికి పైగా పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. పనులు వేగవంతంగా కొనసాగించేందుకు అన్ని రకాల అధునాతన యంత్రాలతో పాటు నిష్ణాతులైనటువంటి ఇంజనీరింగ్ విభాగం పని చేస్తోందన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి రూరల్ పరిధిలోని సాతర్ల పల్లి సమీపంలో ఈ పనులను శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్మనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఆర్డిఓ సువర్ణ, ఆ సంస్థ అధినేతలు అయిన జగదీష్ కదం, పురుషోత్తం గంగాధర్, ఆర్.కె.సింగ్లు ఉదయం 09:30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సంస్థ వానవోలు నుండి వంకరకుంట ప్యాకేజీ-2 మరియు వంకర కుంట నుండి ఓడుల పల్లి ప్యాకేజీ-3లను దక్కించుకొని 1200 కోట్ల వ్యయంతో రహదారి పనులు చేపట్టినట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: