విజయవాడ : ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 3,4,5 జనవరి 2026 న నందమూరి తారక రామారావు వేదికపై గుంటూరు,(Guntur) అమరావతిలో నిర్వహించనున్న 3 వ ప్రపంచ తెలుగు మహాసభలకు తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి (Governor Ravi) ని కలసి ఆహ్వానించినట్లు పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.

గవర్నర్ సుముఖత చూపారని డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు
తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూర్, మదురై, చెన్నై, తంజావూర్, సేలం, తిరుత్తణి
కంచి, చిదంబరం పలు ప్రాంతాలనుండి తెలుగు మహాసభలకు తెలుగుప్రజలు హాజరు కానున్నారని గవర్నర్ ఆర్.ఎన్. రవి (Governor Ravi) కి డా. గజల్ శ్రీనివాస్ (Srinivas) విన్నవించారు. జనవరి 3 వ తేదిన ఉదయం 10గంటలకు జరిగే మహాసభల ప్రారంభోత్సవ సభకు విశిష్ఠ అతిథిగా వచ్చి తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు తమిళనాడు గవర్నర్ సుముఖత చూపారని డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: