Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారబోతున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాల (Monsoon) ప్రభావం తగ్గుతుండగా, రేపు (అక్టోబర్ 16) ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి అడుగుపెట్టనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకటి, రెండు రోజుల్లో ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వెనక్కు వెళ్లడంతో, ఈశాన్య రుతుపవనాల రాకకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
Modi Kurnool Visit: మోదీ పర్యటనకు కర్నూలు రెడీ..

Rain Alert
సాధారణం కంటే ఎక్కువ వర్షాలు
ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. లానినొ ప్రభావం కారణంగా ఈ రుతుపవనాలు మరింత చురుకుగా ఉండనున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దక్షిణ భారత రాష్ట్రాలు — ఆంధ్రప్రదేశ్,(Andhra pradesh) తమిళనాడు, కేరళ, కర్ణాటక —లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంది.
తుపానుల ముప్పు బంగాళాఖాతంలో
వాతావరణ నిపుణుల ప్రకారం, అక్టోబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది బలపడితే తుపానుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరికలు వెలువడ్డాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తీరప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యాక ఈ వర్షాలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
రైతుల్లో ఆందోళన
ఇటీవల ముగిసిన నైరుతి రుతుపవనాల కారణంగా ఖరీఫ్ పంటలు ఇప్పటికే నష్టపోయాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షాలు (Rains) అసమానంగా కురవడంతో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, తెగుళ్లు వ్యాప్తి చెందడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఈశాన్య రుతుపవనాలు భారీ వర్షాలను తెస్తాయన్న అంచనాలతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
నిపుణుల సూచన
వాతావరణ నిపుణులు రైతులు వర్ష పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించాలని సూచిస్తున్నారు. Rain Alert తీరప్రాంత ప్రజలు తుపానులపై అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఈశాన్య రుతుపవనాలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి?
రేపు (అక్టోబర్ 16) దేశంలోకి ప్రవేశించి, ఒకటి రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను తాకే అవకాశం ఉంది.
ఈ రుతుపవనాలతో వర్షపాతం ఎలా ఉండొచ్చు?
లానినొ ప్రభావం కారణంగా ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: