అందుబాటులోకి రానున్న 1,000 పడకలు: మంత్రి సత్యకుమార్
విజయవాడ : ప్రభుత్వాస్పత్రుల్లో మాతా, శిశు వైద్య సేవలను విస్తరింపజేసి గర్భిణులు, నవజాత శిశువుల మరణాలను తగ్గించే కూటమి ప్రభుత్వ ప్రయత్నాల్లో ఒక పెద్ద అడుగు ముందుకు పడనుంది. గుంటూరు, కాకినాడ సర్వజన ఆస్పత్రు(జిజిహెచ్ )ల్లో రెండు నూతన ఎంసిహెచ్ (మదర్ అండ్ చైల్డ్ కేర్) బ్లాకుల ద్వారా సేవలను పెంచడానికి ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ రెండు బ్లాకుల్లో వైద్యసేవలందించడానికి అవసరమయ్యే వైద్య పరికరాలను, ఇతర అవసరమైన వస్తువులను రూ.51.33 కోట్లతో కొనుగోలు చేయడానికి వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ (Satyakumar) యాదవ్ ఆమోదం తెలిపారు.

రెండు నూతన ఎంసిహెచ్ బ్లాకులు.
గుంటూరు జిజిహెచ్ లో పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో రూ.86 కోట్లతో నిర్మించబడుతున్న నూతన ఎంసిహెచ్ బ్లాకు త్వరలో పూర్తి కానున్నది. దీనిలో 500 పడకల ద్వారా మాతా, శిశు వైద్యసేవలల్ని విస్తృతం చేయనున్నారు. ఇదే రీతిన, కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సహకారంతో రూ. 46కోట్లతో నిర్మాణంలో వున్న మరో ఎంసిహెచ్ (MCH) బ్లాకు కూడా త్వరలో పూర్తి కానున్నది. దీనిలో కూడా మరో 500 పడకలతో సేవలందించేదుకు వీలుంది. ఈ రెండు ఎంసిహెచ్ బ్లాకుల ద్వారా సేవలందించేందుకు అవసరమైన వైద్య పరికరాలు, అనుబంధ సామ్రగిని రూ.51.33 కోట్లతో కొనుగోలు చేయడానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అనుమతించారు. మొత్తం 332 రకాలకు చెందిన 5,687 పరికరాలు మరియు సామ్రగిని కొనుగోలు చేస్తారు.
వైద్య పరికరాలను భారీ స్థాయిలో కొనుగోలు
గుంటూరు జిజిహెచ్లో 37 రకాలకు చెందిన 1,187 పరికరాలను రూ.23.51 కోట్లతో అందజేస్తారు. కాకినాడ జిజిహెచ్ లో 295 రకాలకు చెందిన 4,500 పరికరాలను రూ.27.82 కోట్లతో ఏర్పాటు చేస్తారు. ఈ కొత్త బ్లాకుల కోసం పడకలు, బెడ్లు, ఐసియు బెడ్లు, పేషెంట్ మోనిటర్లు, వెంటిలేటర్లు, డీఫిజ్రిరేటర్లు, ఇసిజి మెషీన్లు, మొబైల్ ఎక్స్ యూనిట్లు, మొబైల్ ఆల్ట్రా సౌండ్ మెషీన్లు, నిబులైజర్లు, డెలివరీ సెట్లు, ఆక్సీ మీటర్లు, ఫోటో థెరపీ యూనిట్లు, సర్జికల్ ఛైర్లు వంటి పలు రకాల వైద్య పరికరాలను భారీ స్థాయిలో కొనుగోలు చేయనున్నారు. ఈ రెండు ఆస్పత్రుల్లో >>2 ఎంసిహెచ్ బ్లకుల నిర్మాణానికి ముందుకొచ్చిన గుంటూరు మెడికల్ కాలేజీ అలమ్నై ఆఫ్ నార్త్ అమెరికా, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ అలమ్నై ఆఫ్ నార్త్ అమెరికాలను మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అభినందించారు. ఈ బ్లాకుల నిర్మాణాలకు కృషి చేసిన ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు, సిబ్బందిని మంత్రి ప్రశంసించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: