దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల(New year 2026) సందర్భంగా ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లలో భారీగా బుకింగ్స్ నమోదయ్యాయి. గత సంవత్సరాల మాదిరిగానే బిర్యానీ అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా నిలిచినా, ఈసారి వినియోగదారులు చేసిన కొన్ని కొనుగోళ్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
Read Also: Indian Railways: వందే భారత్ స్లీపర్ సేవలకు గ్రీన్ సిగ్నల్

ఆహారంతో పాటు ఐఫోన్లు, బంగారు నాణేలు, స్మార్ట్ వాచ్‌లు వంటి ఖరీదైన వస్తువులు కూడా డెలివరీ యాప్‌ల ద్వారా ఆర్డర్ చేసినట్లు సమాచారం. అలాగే ఉప్మా, కిచిడీ, హల్వా, సలాడ్లు వంటి సాధారణ ఆహార పదార్థాలకు కూడా మంచి డిమాండ్ కనిపించింది. ప్రధాన డెలివరీ సంస్థ స్విగ్గీ ఒక్క రోజులోనే రెండు లక్షలకు(New year 2026) పైగా బిర్యానీ ఆర్డర్లు, లక్షకు మించి బర్గర్ డెలివరీలు చేసినట్లు వెల్లడించింది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు ఇంటి నుంచే వేడుకలు జరుపుకోవడం వల్ల ఈ రికార్డు స్థాయి ఆర్డర్లు నమోదైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: