ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు లిక్కర్ షాపులు (AP Liquor shop), బార్లపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేసింది. ముఖ్యంగా అసలైన మద్యం విక్రయాలు జరగడానికి కొత్త నియమాలను అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వుల రూపంలో విడుదల చేశారు.
Read Also: AP: గూగుల్ ఏఐ హబ్.. ఏపీ సర్కార్‌పై జేపీ ప్రశంసలు
తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఏ లిక్కర్ షాపు (AP Liquor shop)లోనూ మద్యం బాటిళ్లను నిర్లక్ష్యంగా విక్రయించరాదు. ప్రతి బాటిల్ మీద ఉన్న QR కోడ్ (QR code) స్కాన్ చేసిన తర్వాత మాత్రమే ఆ మద్యం అమ్మకం జరగాలి. దీని ద్వారా ఆ మద్యం అసలైనదా, నకిలీదా అనే విషయాన్ని తక్షణమే నిర్ధారించవచ్చు. ఈ సదుపాయం మద్యాన్ని కొనుగోలు చేసే వినియోగదారులకు కూడా పారదర్శకతను తీసుకురానుంది.
మద్యం బాటిల్‌పై ఉండే QR కోడ్ (QR code) స్కాన్ చేస్తే ఉత్పత్తి వివరాలు, తయారీ సంస్థ సమాచారం, బ్యాచ్ నంబర్, లైసెన్స్ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.మరోవైపు నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం యాప్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ పేరుతో మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చింది.ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను తప్పనిసరిగా స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలా స్కాన్ చేయగానే ఆ మద్యం ఎక్కడ తయారైంది, ఎటు నుంచి ఎటు వెళ్లిందనే వివరాలు తెలుస్తాయి.
లిక్కర్ షాపు యజమానులు మద్యం
ఈ నేపథ్యంలో లిక్కర్ షాపులు. బార్ల వద్ద మద్యం బాటిల్ స్కాన్ చేయడం తప్పనిసరి. అమ్మేముందు లిక్కర్ షాపు యజమానులు మద్యం బాటిల్ స్కాన్ (Bottle scan) చేసిన తర్వాతనే విక్రయించాల్సి ఉంటుంది.

అలాగే తమ వద్ద విక్రయించే మద్యం.. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నాణ్యమైనది, నిజమైనదని ధ్రువీకరించాం.. అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని ఏపీ ఎక్సైజ్ శాఖ నిబంధనలు విధించింది.
మరోవైపు మద్యం అమ్మకాలు జరిపే ముందు లిక్కర్ బాటిల్ (Liquor bottle) పైన సీల్, క్యాప్, హోలోగ్రామ్ వంటి అంశాలను పరిశీలించాలని నిబంధనల్లో స్పష్టం చేశారు. అలాగే ప్రతీ లిక్కర్ షాపు, బార్లలోనూ తప్పనిసరిగా ఓ రిజిస్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రిజిస్టర్‌లో ఆ రోజు అమ్మిన లిక్కర్ బ్రాండ్లు, బ్యాచ్ నంబర్లు నమోదు చేయాల్సి ఉంటుంది.
లిక్కర్ షాపులు, బార్ల యజమానులను
అలాగే క్యూఆర్ కోడ్ ఎప్పుడు తనిఖీ చేశారు వంటి వివరాలను కూడా ఈ రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఏపీ ఎక్సైజ్ శాఖ.. లిక్కర్ షాపులు, బార్ల యజమానులను ఆదేశించింది.అలాగే ఎక్సైజ్ సిబ్బంది ర్యాండం విధానంలో ప్రతిరోజూ తనిఖీలు చేయాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తనిఖీ తర్వతా ఆ వివరాలను సదరు ఎక్సైజ్ అధికారి రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ప్రతి లిక్కర్ షాపు, బార్‌లోని మద్యం బాటిళ్లలో కనీసం ఐదు శాతాన్నైనా స్కాన్ చేయాలనే రూల్ విధించింది. నకిలీ మద్యం ప్రజలు పిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసే పనిలో ఏపీ ప్రభుత్వం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: