నెల్లూరు (Nellore) లో, రోడ్డుపై అడ్డుగా నిలిపిన బైక్ పక్కకు తీయమని కోరిన పాపానికి డ్రైవర్, కండక్టర్ పై ఐదుగురు యువకులు దాడికి దిగారు. వివరాల్లోకి వెళితే.. ఎస్ఏఎస్ సిటీ బస్సు సర్వీసు గాంధీబొమ్మ నుండి బోసుబొమ్మ వైపు వెళ్తుండగా, కొంతమంది యువకులు మద్యం మత్తులో తమ ద్విచక్ర వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. వాటిని తొలగించాలని డ్రైవర్ మన్సూర్ హారన్ కొట్టినా వారు ఏ మాత్రం పట్టించుకోకుండా దుర్భాషలాడారు.
Read Also: YCP: వైసీపీ ‘కోటి సంతకాలు’లో మార్పులు – సజ్జల
దర్యాప్తు ప్రారంభించారు
దీంతో, బస్సు దిగిన డ్రైవర్‌కు, యువకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో డ్రైవర్ మన్సూర్ ఒక ద్విచక్ర వాహనం యొక్క తాళం తీసుకుని బస్సును ముందుకు పోనిచ్చారు. ఆగ్రహంతో రగిలిపోయిన యువకులు మరో ద్విచక్ర వాహనంపై బస్సును వెంబడించి బోసుబొమ్మ వద్ద అడ్డగించారు.

అనంతరం (Nellore) బస్సులోకి చొరబడి డ్రైవర్ మన్సూర్, కండక్టర్ సలాంపై బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు.గాయపడిన ఇద్దరినీ స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించారు. సమాచారం అందుకున్న సంతపేట ఇన్‌స్పెక్టర్ సోమయ్య వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను నగరానికి చెందిన మదన్, అతని స్నేహితులుగా గుర్తించి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: