నెల్లూరు: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ (C.R Patil) చేతుల మీదుగా అవార్డులందుకున్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు నీటి సంరక్షణలో నెల్లూరు టాప్ దేశ స్థాయిలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. జల్ సంచయ్ జన్ భగీదారీ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాల పెంపుతో పాటు జల సంరక్షణలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల నేతృత్వంలో లో అధికారుల పనితీరుకు జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర జల శక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ గంగాభవాని కూడా అవార్డు స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read also: Amaravati: రాజధాని వరద ముంపు నివారణకు రెండో పంపింగ్ స్టేషన్కు టెండర్లు

National awards for AP in water conservation
నీటి సంరక్షణ కార్యక్రమాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన నెల్లూరు జిల్లాకు దేశ స్థాయిలో జల్ సంచయ్ జన్ భగీదారి 1.0 జాతీయస్థాయి అవార్డు లభించింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన జల్ సంచయ్ జన్ భగీదారీ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసినందుకు, నీటి భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం నీటి సంరక్షణ సమర్థవంతంగా అమలు చేసిన నేపథ్యంలో సౌత్ జోన్లో జిల్లాకు ఈ పురస్కారం లభించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద ఫారం పాండ్లు 856.
నీటి కొరత నివారణ
ఇంకుడు గుంటలు 3,495, ఊట చెరువులు 112, చెక్ డ్యామ్లు 166, డగౌట్ పాండ్లు, వాటర్ హార్వెస్టింగ్ పాండ్లు 512, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు 54. రింగ్ ట్రెంచులు 12, సరిహద్దు కందకాలు 34, నీటి నిల్వ కందకాలు 14, చెరువుల పూడికతీత పనులు 247, మొత్తం 5,502 భూగర్భ జలాల రీఛార్జ్ పనులు చేపట్టడం ద్వారా ఈ అవార్డును సాధించారు. జల్ సంచయ్ జన్ భగీదారి అంటే ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా పనిచేసి ప్రతి నీటి చుక్కను సంరక్షించడం, భవిష్యత్తు తరాల కోసం నీటి భద్రతను కాపాడడానికి నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యంగా జరిగిన ఈ కార్యక్రమాల ద్వారా వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్, నీటి కొరత నివారణ, ప్రజల్లో నీటి ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడం జరిగింది.
వాటర్ షెడ్ పనుల్లో ప్రకాశం భేష్
ఒంగోలు: వాన నీటిని ఒడిసిపట్టడములో జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. అడుగంటిన భూగర్భ నీటి మట్టాన్ని తిరిగి ఆశవాహస్థితికి తీసుకురావడంలో సఫలీకృతమైంది. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే మెచ్చి… ప్రశంసా పత్రం ఇచ్చి… శభాష్ అంటూ వెన్నుతట్టి అభినందించింది. ఔను… వాటర్ షెడ్ పనులలో భాగంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో చేపట్టిన నీటి సంరక్షణ పనులకు కేంద్ర జలశక్తి శాఖ మురిసిపోయింది. జిల్లా యంత్రాంగం చేసిన కృషికి గుర్తింపుగా ద్వితీయ జాతీయ ఉత్తమ నీటి పురస్కారం అవార్డును ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలోని విజాన్ భవన్లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఈ ఆవార్డు అందుకున్నారు.
ఆరవ జాతీయ ఉత్తమ జల పంచాయతీ అవార్డుకు కనిగిరి నియోజకవర్గం, పెదచెర్లోపల్లి మండలం, మురుగమ్మి గ్రామ పంచాయతీ ఎంపికైంది. 2022- 23 సంవత్సరంలో జిల్లాలో డ్వామా ఆధ్వర్యంలో వాటర్ షెడ్ పథకంలో భాగంగా నీటి సంరక్షణ పనులను చేపట్టారు. ఉత్తమ నీటి యాజమాన్య పద్ధతులు పాటించారు. ఇందులో భాగంగా రిడ్జ్ టు వ్యాలీ విధానంలో వివిధ రకాలైన సహజ వనరుల యాజమాన్యపు పనులు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో మరియు భూగర్భ జలమట్టాలను పెంపొందించడంలో ఉత్తమ పద్ధతులను పాటించారు.
రెండో ఉత్తమ పురస్కారాన్ని ప్రకటించింది
ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ నెలలో కేంద్ర బృందం వచ్చి క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించింది. భౌగోళికంగా భిన్న పరిస్థితులు ఉన్న ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో నీటి సంరక్షణ పనులలో సాధించిన పురోగతిని అభినందిస్తూ జిల్లాకు జాతీయస్థాయిలో రెండో ఉత్తమ పురస్కారాన్ని ప్రకటించింది. జిల్లా కలెక్టరుకు ఒక ట్రోఫీ, ప్రశంసాపత్రం, రూ.1.5 లక్షల నగదును అందించింది. ఈ పథకం అమలులో జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేలా పనులను పర్యవేక్షించిన డ్వామా పిడి జోసెఫ్ కుమారును కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: