Nellore District: నెల్లూరు జిల్లాకు చెందిన భార్యాభర్తలు పెద్ద మనసుతో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలకు భారీగా విరాళాలు అందజేసి తమవంతుగా సాయం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన బచ్చు కృష్ణకుమార్ దంపతులు అమరా బచ్చు ఛారీటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. ఏకంగా కోట్లాది రూపాయల్ని స్కూల్స్, కాలేజీల కోసం ఖర్చు చేస్తున్నారు.
బచ్చు కృష్ణకుమార్ దంపతులు మంత్రి నారా లోకేష్‌ను (Nara Lokesh) కలిశారు. బోగోలు మండలంలోని ప్రభుత్వ స్కూల్స్, ఇంటర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.5 కోట్లు ఇస్తామని ప్రకటించారు. స్కూల్స్, కాలేజీల్లో త్వరలో చేపట్టనున్న ఆయా అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవ్వాలని మంత్రి లోకేష్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ బచ్చు కృష్ణకుమార్ దంపతుల్ని అభినందించారు.
Read Also: Jagan Mohan Reddy: ఆదాయాలు తగ్గినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాము

వైద్యం, ఆధ్యాత్మిక రంగాలకు భారీ సాయం
అంతేకాదు అమరా బచ్చు ట్రస్ట్ ఆధ్వర్యంలో.. బోగోలు మండలం కొవ్వూరుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి రూ.5 కోట్లు ప్రకటించారు. అలాగే కొండబిట్రగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి మరో రూ.5 కోట్ల సాయాన్ని అందించనున్నారు.’నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన అమరా ఛారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులను ఉండవల్లి నివాసంలో కలిశాను. బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.5 కోట్ల సాయం అందించినందుకు అభినందనలు తెలిపాను’ అంటూ మంత్రి లోకేష్ కూడా ట్వీట్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: