Nellore Horticulture Development: నెల్లూరు జిల్లాలో ఉద్యానవన శాఖను బలోపేతం చేయడమే లక్ష్యంగా, వినూత్న ఆలోచనలతో మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఉద్యానవన శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
Read Also: Deworming Tablets: చిన్నారులకు నులిపురుగుల మాత్రలు తప్పనిసరి: హిమాన్షు శుక్ల
మోడరన్ నర్సరీల ఏర్పాటు
జిల్లాలో ఆధునిక ఉద్యానవన నర్సరీల ఏర్పాటుపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. పెన్నా నది లేదా సంగం బ్యారేజ్ పరిసర ప్రాంతాల్లో, ఐదు సంవత్సరాల లీజు ప్రాతిపదికన నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలించి, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Nellore Horticulture Development: మండలానికి ఒక గుర్తింపు – ‘స్పెషల్ థీమ్’
ఉద్యాన అధికారులు కేవలం లక్ష్యాల సాధనకే పరిమితం కాకుండా, ప్రతి మండలానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలా పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
- ప్రతి మండలం ఒక ఉద్యాన పంటల హబ్గా మారాలి.
- కలువాయి, సైదాపురం, దుత్తలూరులోని కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి.
- జిల్లా వ్యాప్తంగా ఫాం పాండ్స్ (పంట కుంటలు) మరియు పాలీ హౌస్‌ల సంఖ్యను భారీగా పెంచాలి.
వినూత్న ఆలోచనలు.. మెరుగైన నిధులు
అధికారులు శాస్త్రీయ దృక్పథంతో పాటు వినూత్నంగా ఆలోచించాలని, కొత్తదనంతో ముందుకు వస్తే అవసరమైన నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిపాదించిన “ఒక జిల్లా – ఒక ఉత్పత్తి” (One District – One Product) విధానంలో నెల్లూరు జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: