నెల్లూరులో(Nellore Accident) ఆటోను గుద్దిన కారు.. 16 మంది.. ఇటీవల దేశంలో ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీరిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. పిల్లల్ని కోల్పోతున్న తల్లిదండ్రులు, తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైపోతున్న చిన్నారు.. వెరసీ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చుతున్నారు. ప్రభుత్వాలు, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. ఎన్ని చర్యలు చేపడుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 24మంది మరణించారు. ఆ ప్రమాద వేదన మరువకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది.
Read Also: Khawaza Asif : చర్చలు ఫలించకపోతే యుద్ధమే.. ఖవాజా ఆసిఫ్
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉలవపాడు బైపాస్ వద్ద ఘోర ప్రమాదం ఉలవపాడు బైపాస్ దగ్గర ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 13మంది మహిళలకు, కారులో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. కొందరు మహిళలు రోడ్డుపైనే తీవ్ర గాయాలతో స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో ప్రస్తుతం నలుగురి మహిళల పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వీరిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. నెల్లూరు జిల్లాలో లోకేష్ పర్యటన కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తున్నది. కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు బాధితులను పరామర్శించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: