ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలో పేతం చేస్తాం అని పదేపదే చెబుతున్నప్పటికీ, కనిపి స్తున్న వాస్తవాలు మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నాయి. నిజమైన బలోపేతం అంటే పిల్లల సంఖ్య పెరగాలి, సరి పడా ఉపాధ్యాయులు ఉండాలి, వారికి బోధనకు పూర్తి స్థాయి సమయం ఉండాలి, పాఠశాలల్లో గుణాత్మక విద్య వికసించాలి. కానీ నేడు ఈ అవసరాలకు బదులుగా సమ స్యలే పెరుగుతున్నాయి. గత మూడు విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో (Government schools )విద్యార్థుల సంఖ్య ఇలా తగ్గిపోయింది. 2023-24లో 81,08,406 మంది విద్యార్థులుండగా 2024-25లో 78,69,714, 2025-26కి 76,02,854 తగ్గిపోతూ వస్తున్నది. ప్రతి సంవత్సరం లక్షల్లో పిల్లలు ప్రభుత్వ పాఠశాలల (Government schools) నుండి జారిపోతుంటే, ఇది బలోపేతా నికి సంకేతమా లేకబలహీనతకా? గత ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలను ప్రస్తుత ప్రభుత్వం అప్పుడు విమర్శిం చింది. ఇప్పుడు వాటిని రద్దు చేయకుండా అదే దారిలో మరిన్ని దుష్పరిణామక చర్యలను తీసుకువస్తున్నది. విద్యా సంవత్సరం మొదలైన రోజు నుంచే పాఠాలు చెప్పే అవకా శాన్ని యాప్లు, రికార్డులు, మీటింగ్లు,అప్రయోజక కార్యక్ర మాలు అడ్డుకుంటున్నాయి. లీప్ యాప్లో 70 రకాల టైల్స్, విద్యామిత్ర, ఐఎమ్ఎమ్ఎస్, దీక్ష, పిఎం,ఎస్ఎస్ఎ వంటి అప్లికేషన్ల పనులు ఉపాధ్యాయుల సమయాన్ని పూర్తిగా ఆక్రమిస్తున్నాయి. ఆన్లైన్ ట్రైనింగులు, 20 రోజులపాటు యోగా డే, మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాలు ఇవన్నీ కలిపి బోధనా పీరియడ్లను తీవ్రంగా తగ్గించాయి. పరీక్షల మూల్యాంకనం గందరగోళంగా ఉందని ఉపాధ్యాయులు అభిప్రాయం.
Read Also: Tirumala: భక్తుల మనోభావాలపై ఆటలాడొద్దు పవన్ కల్యాణ్

ఎపి విధానాల బలవంతపు అమలు పరిస్థితులను మరింత క్లిష్టం చేశాయి. ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడూ చూడని విధంగా ఉపాధ్యాయులు “పాఠాలు చెప్పనీ యండి” అంటూ ఉద్యమానికి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలు తగ్గిపోతున్నారు, ఉపాధ్యాయులు తగ్గుతున్నారు, తరగతులు విలీనమవుతు న్నాయి. పాఠశాలలు మూతపడుతున్నాయి. 9 రకాల పాఠశాలలతో గందరగోళం పెరిగింది. ఈ పరిస్థితుల్లో విద్యను బలోపేతం చేస్తామనడం ఎలా నమ్మాలి? ఉపాధ్యాయుల బోధనకన్నాడిజిటల్ ట్రాకింగ్, యాప్లు, గణాంకాలు ముఖ్యమయ్యాయి. పిల్లల అభ్యసనా నికి అవసరమైన వాతావరణం బలహీనమైంది. వర్క్ ఫౌండే షన్, ఎన్ఎస్ఇఆర్ నివేదికల ప్రకారం ఉపాధ్యాయులు అత్యధిక ఒత్తిడికి గురవుతున్నారు. సెలవుల్లో కూడా వృత్తికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. నిరంతరఆన్లైన్గ ణాంకాల సమర్పణ ఒక నియమంగా మారింది. 35 దేశాల సర్వేలో భారత యువత ఉపాధ్యాయ వృత్తిని8వ స్థానం లో మాత్రమే ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులపై జరుగుతున్న ఒత్తిడి, గౌరవహీనత దీనికి ప్రధాన కార ణాలు. మాతృభాషలో బోధన నిలిపివేత, పూర్తిగా ఆంగ్ల మాధ్యమం, 9 రకాల పాఠశాలలు, సింగిల్ మీడియం కార ణంగా ఉపాధ్యాయుల తగ్గింపు, ప్రాథమిక పాఠశాలల్లో-సబ్జెక్ట్ టీచర్ల బదిలీలు, 12వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు, బడ్జెట్ కేవలం రూ.10 కోట్లు మాత్రమే. ఒకే ఏడాదిలో 2,66,860 మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారడం. ఈ సంఖ్యలు ప్రభుత్వ విద్యావ్యవస్థపై పెరిగిన అనుమానం విధానాల వైఫల్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. నష్ట దాయక సంస్కరణలను తక్షణం రద్దు చేయాలి. ఉపాధ్యాయులను పూర్తిగా బోధనకే పరిమితం చేయాలి. పరీక్షా, మూల్యాంకన విధానాల పునర్విమర్శ, ప్రభుత్వ పాఠశాలల కు ప్రత్యేక నిధుల కేటాయింపు, ఎపి 2020 రద్దు, రాష్ట్ర అవసరాలకు అనుగుణమైన విధానం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో విస్తృత చర్చలు చేయాలి. విద్యారంగం బలోపేతం కావాలంటే మాటలు కాదులోపా లను అంగీకరించి, విధానాలను సరిచేసి, ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచేదిశగా ప్రభుత్వం నడవాలి. విద్యను వ్యాపారీకరణ వైపుకు లాకెళ్లే మార్గాలను విడనాడి, పిల్లల అభి వృద్ధి కేంద్రంగా ఉండే పాఠశాల వ్యవస్థను పునర్నిర్మించడం ద్వారా మాత్రమే నిజమైన బలోపేతం
జరుగుతుంది.
– కె. విజయ
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: