16న కర్నూలు Kurnool జిల్లాకు రాక ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 16వ తేదీన రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, Nara Lokesh బిసి జనార్దన్ రెడ్డి, అనగాని, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సిఎస్, డిజిపిలు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ క్రమంలో అమరావతి, విశాఖల్లో ప్రధాని పాల్గొన్న కార్యక్రమాలను మించిన స్థాయిలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటనను సక్సెస్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తన పర్యటన సందర్భంగా ప్రధాని శ్రీశైల భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామిని దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభకు హజరు కానున్నారు.
Bihar Elections: బీహార్ ఎన్నికలు: ఎన్డీఏలో మొదలైన సీట్ల వివాదం

Narendra Modi: ప్రధాని పర్యటన
కేంద్రం తెచ్చిన జిఎస్టి 2.0 సంస్కరణలను స్వాగతించి.. దేశంలోనే తొలిసారిగా అసెంబ్లీలో అభినందనల తీర్మానం చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే జిఎస్టి సంస్కరణల ఉత్సవ్ పేరుతో దసరా నుంచి దీపావళి Diwali వరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో జిఎస్టి సంస్కరణల ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని పాల్గొనే ఈ సభను విజయవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ సభనిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని పర్యటన సందర్భంగా వాతావరణ పరిస్థితులను చూసుకుని.. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రధాని సభకు వచ్చే సభికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని, ఆహారం, తాగునీరు సౌకర్యం కల్పించాలని, సభకు వచ్చే అప్రోచ్ రోడ్లను పూర్తి చేయాలని, పార్కింగ్ నిమిత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అలాగే ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అమరావతి జర్నలిస్టులు రూపొందించిన ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్సైట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరావతి ప్రెస్ క్లబ్ కమిటీకి, జర్నలిస్టులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని ప్రాంతంలోని జర్నలిస్టులు అంతా కలిసి ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి ఏర్పాటు చేసుకోవడంతో పాటు నేడు వెబ్ సైట్ను రూపొందించుకోవడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. అమరావతి Amaravati నిర్మాణంలో ముఖ్యమంత్రి ఆలోచనల స్ఫూర్తితోనే 2018లో ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి పురుడుపోసుకుందని కమిటీ సభ్యులు చెప్పారు. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, జర్నలిస్టులు ముఖ్యమంత్రిని కోరగా… ఆయన సానుకూలంగా స్పందించారు.
రాజధానిలో మీడియా అవసరాలు తీర్చడానికి సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అప్పాజీ, జనరల్ సెక్రటరీ సతీష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ నారాయణ, ట్రెజరర్ కె. పూర్ణచంద్రరావు, జాయింట్ సెక్రటరీ మహేష్, కమిటీ సభ్యులు శ్యామ్ సుందర్, మల్లేశ్వర రావు, శ్రీనివాస్, కె. గాంధీ,బాబు, అనిల్ పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: