ఏపీ విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తాజాగా ఒక ప్రత్యేక బాధ్యతను తీరుగా నిర్వర్తించారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే లోకేశ్, ఈసారి తన కుమారుడు నారా దేవాంశ్ చదువుతున్న పాఠశాలకు స్వయంగా వెళ్లి పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) లో పాల్గొన్నారు.
భార్య బ్రాహ్మణితో కలిసి స్కూల్‌కు హాజరు
ఈ సందర్భంగా లోకేశ్ (Nara Lokesh) తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి పాఠశాలకు వెళ్లారు. ఈ అందమైన క్షణాన్ని ‘ఎక్స్’ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఫొటోను షేర్ చేస్తూ, తండ్రిగా తన బాధ్యతను (His responsibility a father) నెరవేర్చిన ఆనందాన్ని తెలియజేశారు.
తండ్రిగా తన పాత్రపై లోకేశ్ స్పందన
సోషల్ మీడియాలో స్పందించిన లోకేశ్, ‘‘ప్రజా జీవితంలో తీరికలు తక్కువే. కానీ ఇలాంటి క్షణాలు మాత్రం ఎంతో విలువైనవి. దేవాంశ్ నువ్వు చెప్పే ముచ్చట్లు నన్ను తండ్రిగా ఆనందింపజేస్తాయి. నిన్ను చూసి గర్వపడుతున్నా’’ అంటూ మక్కువతో పేర్కొన్నారు.
విద్యలో తల్లిదండ్రుల భాగస్వామ్యం – లోకేశ్ సందేశం
ఈ కార్యక్రమం ద్వారా నారా లోకేశ్, తల్లిదండ్రులు విద్యలో ఎంతగానో భాగస్వామ్యం కలిగి ఉండాలని హితవు పలికారు. ఒక ప్రభుత్వ మంత్రిగా కాదు, ఒక తండ్రిగా తన పాత్రను చక్కగా పోషించిన లోకేశ్, సమాజానికి సానుకూలమైన సందేశం ఇచ్చారు.
నారా లోకేశ్ ఎవరు?
నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖల మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు.
నారా లోకేశ్ ఏ స్కూల్‌ను సందర్శించారు?
లోకేశ్ తన కుమారుడు నారా దేవాంశ్ చదువుతున్న స్కూల్‌ను సందర్శించారు. పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) సందర్భంగా ఆయన అక్కడకు వెళ్లారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: