మంత్రి నారా లోకేష్
విజయవాడ : ఉపాధ్యాయుల సహకారంతో ప్రభుత్వ పాఠ శాలల్లో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థి అభ్యసన సామర్థ్యాల పెంపునకు గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్(ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) కార్యక్రమం చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఇంటర్మీడియట్ విద్య ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. స్కూల్ ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ (School Enrollment Drive) ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన విధంగా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమ వివరాలను తెలియజేశారు.
ఉపాధ్యాయులను ప్రేరేపించడం
ఈ సందర్భంగా మంత్రిలోకేష్ మాట్లాడుతూ, విద్యార్థి ప్రాథమిక స్థాయిలోనే గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన పరాక్ సర్వేలో జిల్లా స్థాయి ర్యాంకులను, రాష్ట్రస్థాయి ర్యాంకులను మెరుగుపర్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అకడమిక్ ఫోరమ్ లను బలోపేతం చేసి, ఉపాధ్యాయులను ప్రేరేపించడం (Motivating teachers) ద్వారా అభ్యసన ఫలితాలు మెరుగుపర్చాలని సూచించారు. అత్యున్నత ప్రమాణాలతో పారదర్శకంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపి సెప్టెంబర్ 52 ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికను అత్యున్నత ప్రమాణాలతో పారదర్శకంగా చేపట్టాలి.

నిపుణులను భాగస్వామ్యం
ప్రతి హైస్కూల్ కి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో పాటు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుచేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ను పునర్ వ్యవస్థీకరించి నిపుణులను భాగస్వామ్యం చేయాలని, త్వరలోనే బోర్డ్ మీటింగ్ నిర్వహించాలని ఆదేశించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (తిగిలి) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమర్థవంతంగా స్టెమ్ యాక్టివిటీస్ (STEM Activities) చేపట్టాలని ఆదేశించారు. హైస్కూల్ ప్లస్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు రాష్ట్రంలో హైస్కూల్ ప్లస్ ల పనితీరుపై సమగ్రంగా చర్చించారు. హైస్కూల్ ప్లస్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
నారా లోకేశ్ వయసు ఎంత?
నారా లోకేశ్ వయసు 42 సంవత్సరాలు.(ఆయన జననం 23 జనవరి 1983).
నారా లోకేశ్ విద్యార్హత ఏమిటి?
నారా లోకేశ్ఉన్నత విద్యను అమెరికాలో పూర్తి చేశారు.ఆయనకు స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (Stanford Graduate School of Business) నుంచి ఎంబీఏ డిగ్రీ ఉంది.అలాగే కార్నెగీ మెలాన్ యూనివర్శిటీ (Carnegie Mellon University) నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (B.Sc) డిగ్రీను మెనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (Management Information Systems) స్పెషలైజేషన్‌లో పూర్తిచేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: TTD: 19న అక్టోబర్ నెల ఆర్జితసేవల టిక్కెట్లు విడుదల