ప్రశాంతి నిలయం నిజమైన శాంతి, ఆధ్యాత్మికతకు నిలయమని ఏపీ విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) అన్నారు. పుట్టపర్తిని సందర్శించే ప్రతిసారీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తనను ప్రేమతో “బంగారూ” అని పిలిచిన భావన కలుగుతుందని తెలిపారు. ప్రేమ ఉంటే సాయిబాబా సాన్నిధ్యం ఎప్పటికీ మన మధ్య ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయంలో నిర్వహించిన మహోత్సవాలకు మంత్రి లోకేశ్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
Read also : Gautam Gambhir: పిచ్ కీలకం కాదు.. ఆటగాళ్ల నైపుణ్యం ముఖ్యం: గంభీర్

దైవత్వంతో నిండిన కృతజ్ఞతా సందర్భమని
బాబా శతజయంతి సాధారణ వేడుక కాదని, ఇది దైవత్వంతో నిండిన కృతజ్ఞతా సందర్భమని లోకేశ్ పేర్కొన్నారు. ప్రేమ, సేవ, మానవ విలువలతో నిండిన బాబా శతాబ్ది ప్రయాణం లక్షలాది మందికి మార్గదర్శకమైందని అన్నారు. ఈ పుణ్యోత్సవాలను నిర్వహించిన నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మహోత్సవాల్లో పాల్గొనడం తమకు గొప్ప భాగ్యమని చెప్పారు.
“భగవాన్ బోధించినట్లు, సేవే నిజమైన కులం, సమానత్వమే పరమమతం. ప్రార్థన కంటే సాయం చేసే చేతులు పవిత్రమైనవి. ‘అందరినీ ప్రేమించు – అందరికి సేవచేయి, ఎప్పుడూ సహాయం చేయి – ఎవరినీ బాధపెట్టకు’ అనే బాబా సందేశం శాశ్వతం. ‘నా జీవితం నా సందేశం’ అన్న బాబా జీవితమే మనకు మార్గదర్శక గ్రంథం” అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :