ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) సోషల్ మీడియాలో ఓ వినూత్న ప్రయోగంతో అందరి దృష్టిని ఆకర్షించారు. తాను ధరించిన కొత్త జాకెట్ ఫోటోను షేర్ చేస్తూ దాని తయారీ గురించి నెటిజన్లను అంచనా వేయమని కోరారు. సరైన సమాధానం చెప్పేవారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించడంతో ఆ పోస్ట్ పై పెద్ద ఎత్తున స్పందనలు వచ్చాయి. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు–2025కు హాజరైనప్పుడు లోకేశ్ ఈ ప్రత్యేక జాకెట్‌ను ధరించారు. “ఈ జాకెట్ ఎలా ఉంది? ఇది దేనితో తయారు అయిందో guess చేయండి” అని #GuessAndWin హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన పోస్ట్ చేయడంతో నెటిజన్లు పలు ఊహాగానాలు చేశారు. కొన్ని మిలాన్ డిజైన్, మరికొన్ని ఖరీదైన ఫ్యాబ్రిక్ అంటూ సమాధానాలు ఇచ్చారు.
Read also: AP: పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ..

Nara lokesh: తన జాకెట్‌పై సోషల్ మీడియాలో క్విజ్ పెట్టిన లోకేశ్
ప్రత్యేకంగా నేసిన వస్త్రంతో
అయితే, కొద్ది సేపటికే లోకేశ్ మరో పోస్టుతో అసలు విషయం వెల్లడించారు. సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఈసారి ఎవరికీ దక్కలేదని, ఎందుకంటే చాలామంది ఇచ్చిన అంచనాలు తప్పాయని పేర్కొన్నారు. తన జాకెట్ విదేశాల్లో కానీ, ముంబై–దిల్లీ వంటి ఫ్యాషన్ హబ్‌లలో కానీ రూపొందించలేదని స్పష్టం చేశారు. అది తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి మండలంలోని పులగుర్త గ్రామస్థుల చేతుల్లో పుట్టిన హస్తకళా నేస్తాల కష్టం అని వెల్లడించారు. అక్కడి కళాకారులు ఖాదీ, మల్ ఫ్యాబ్రిక్‌లను కలిపి ప్రత్యేకంగా నేసిన వస్త్రంతో ఈ జాకెట్ తయారైందని తెలిపారు. స్థానిక కళాకారుల ప్రతిభను వెలుగులోకి తేవడమే ఈ సోషల్ మీడియా క్విజ్ ఉద్దేశమని లోకేశ్ పేర్కొంటూ #GoLocal #AndhraHandlooms హ్యాష్‌ట్యాగ్‌లతో ఏపీ చేనేత విలువను పురస్కరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: