మంగళగిరిలో నూర్ మస్జీద్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్
విజయవాడ : యువత మతం ఏదైనా మానవత్వం ముఖ్యమని, భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్య,(Education) ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి(Nara Lokesh) ఆర్టీసీ డిపో వద్ద పావురాల కాలనీలో నూతనంగా నిర్మించిన నూర్ మస్జీద్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరి ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు దక్కింది. నాకున్న అవకాశాల మేరకు సేవ చేస్తున్నా. సీఎం చంద్రబాబునాయుడు గారికి రాష్ట్రానికి సేవ చేసే అవకాశం దక్కింది. మనతో ఉన్నవారిని పైకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మతం ఏదైనా మానవత్వం మర్చిపోకూడదు. కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించాలి. సమాజంలో ఇంకా పేదరికం ఉంది. పేదరికంలో ఉన్నవారిని అందులో నుంచి బయటకు తీసుకురావాలి.
Read also: కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మాహత్యాయత్నం

భవిష్యత్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నారా లోకేష్
భవిష్యత్(Nara Lokesh) అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలిప్రతి ఒక్కరికి క్రమశిక్షణ, పట్టుదల చాలా అవసరం. 2019లో దేవుడు నాకు పరీక్ష పెట్టాడు. నన్ను అనేక మంది ఎగతాళి చేశారు. అదే దేవుడు నాకు శక్తి కూడా ఇచ్చాడు. క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేస్తే విజయం దక్కుకుంది. మనందరికీ దేవుడు శక్తి ఇచ్చాడు. దానిని వినియోగించుకోవాలి. కష్టాలు అందరికీ ఉంటాయి. వాటిని అధిగమించాలి. అందరూ రాష్ట్ర, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. కాలం మారింది. అందరూ చదువుకోవాలి. భవిష్యత్ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి. అని పేర్కొన్నారు. 2047 నాటికి దేశాన్ని అగ్రపథాన నిలిపేందుకు ప్రధాని మోడీ కృషిచేస్తున్నారు.
నైతిక విలువల కోసం మంత్రి లోకేష్ పిలుపు
మెరుగైన సమాజం కోసం నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉంది. మహిళలను గౌరవించాలి. దేవుడు నాపై పవిత్ర బాధ్యత పెట్టాడు. దానిని నెరవేర్చాల్సిన ఉండాలి. అవసరం ఉంది. మన మధ్య చిచ్చుపెట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు. ప్రశాంతంగా పనిచేశారని ప్రజలు గుర్తించినప్పుడు నాకు కొండంత బలం. అందరికీ అండగా ఉంటా. కలిసికట్టుగా పనిచేద్దాం అని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు హాజీ షేక్ నాగుల్ మీరా, మసీదు వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ మహమ్మద్ అలీ, మసీదు కమిటీ సభ్యులు షేక్ మహమ్మద్ జానీ, మహమ్మద్ ఫిరోజ్, షేక్ సౌఖత్ అలీ, షాహిద్ అలీ, జాఫర్, నజీర్, ఆసిఫ్, అబ్దుల్లా కుట్టి, పలువురు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: