Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ యువతకు కొత్త అవకాశాల సృష్టి లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరారు. ‘స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రామ్’లో భాగంగా ఆయన ఏడు రోజులపాటు పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, టాప్ కంపెనీల సీఈఓలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రులతో భేటీలు జరపనున్నారు. లోకేశ్ ఈ పర్యటనను గురించి మాట్లాడుతూ “మన యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి, నైపుణ్య, విద్య రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించాలన్నదే నా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు. అదే సమయంలో, అమెరికా (America) టారిఫ్‌ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సమస్యలపై కూడా చర్చలు జరపాలని నిర్ణయించారు.
Read also: Kethireddy 3.0: మూడేళ్ల తర్వాత కేతిరెడ్డి 3.0ను చూపిస్తా – వెంకటరామిరెడ్డి

Australia: ప్రయాణంలోనే దీపావళి వేడుకలు: నారా లోకేశ్
ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ (Australia) సీఫుడ్ అసోసియేషన్‌తో సమావేశమై, కొత్త మార్కెట్లను అన్వేషించే మార్గాలపై చర్చించనున్నారు. అలాగే, ఆస్ట్రేలియాలోని తెలుగు ప్రవాసులతో కూడా నారా లోకేశ్ (Nara Lokesh) సమావేశం కానున్నారు. “వారి ఆలోచనలు, సలహాలు ఎప్పుడూ నాలో కొత్త శక్తిని నింపుతాయి” అని ఆయన పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా మాట్లాడుతూ లోకేశ్ “ఈ ఏడాది కూడా సీఐఐ రోడ్‌షో కారణంగా పండుగను ప్రయాణంలోనే జరుపుకోవాల్సి వస్తోంది. అయితే ఈ పర్యటన ఫలప్రదమై ఆస్ట్రేలియా కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనే నిర్ణయం తీసుకుంటే, అదే మన ప్రజలకు నిజమైన దీపావళి బహుమతి అవుతుంది” అని అన్నారు.
నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన ఎందుకు చేపట్టారు?
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి, నైపుణ్య రంగాల్లో కొత్త అవకాశాలు కల్పించడమే ఆయన పర్యటన ప్రధాన ఉద్దేశం.
ఈ పర్యటనలో ఎవరితో భేటీ కానున్నారు?
ప్రముఖ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, టాప్ కంపెనీల సీఈఓలు, సీఫుడ్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమవుతారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: