విజయవాడ: ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు వారున్నారంటే ఆ క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి లోకేశ్ (Nara Lokesh) పేర్కొన్నారు. సింగపూర్లో (Singapore) ఆదివారం ఆయన తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు శాసించేందుకు చంద్రబాబు విజనరీ కారణమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారని తెలిపారు.

రాష్ట్రంలో సైకో పాలన, విధ్వంస పాలన చూశాం: లోకేశ్
ఉపాధి కోసం ప్రపంచవ్యాప్తంగా మనవాళ్లు వెళ్లారని చెప్పారు. సింగపూర్లో తెలుగు ప్రజలు ఉన్నా ఆంధ్రపైనే మనసు ఉంటుందని లోకేశ్ (Nara Lokesh) వివరించారు. “ఏపీలో రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితుల గురించి నా కంటే మీకే బాగా తెలుసు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో సైకో పాలన, విధ్వంస పాలన చూశాం. ఎన్నికల సమయంలో కొందరు దాదాపు 6 నెలలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వచ్చి కష్ట పడ్డారు. రాష్ట్రాన్ని దారిలో పెట్టేందుకు కష్టపడి నందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గతంలో చంద్రబాబు అరెస్టైనప్పుడు ఇదంతా మనకు అవసరమా అని బ్రాహ్మణి అడిగింది. అదే సమయంలో హైదరాబాద్లో 45,000ల మంది ఐటీ నిపుణులు చంద్రబాబు వెంట ఉంటామని చెప్పారు. ఐటీ నిపుణులు అండగా నిలబడ్డారు. అదే మారు కొండంత దైర్యమని లోకేష్ పేర్కొన్నారు. తెలుగు జాతి అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలిచేందుకు ఆరోజే కష్టపడాలని నిర్ణయించుకున్నాను, దారి తప్పిన ఏపీని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషిచేస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సింగపూర్ను రోల్ మోడల్గా తీసుకుంటున్నాం.
ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో ముందు కెళ్తున్నాం. రాయలసీమకు పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ప్రకాశం జిల్లాను సీబీజీ హబ్ నియమించుకున్నామని లోకేశ్ వివరించారు. దేశంలో తొలి క్వాంటం వ్యాలీని అమరావతికి తీసుకొచ్చాం. ఉభయగోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున ఆక్వాను ప్రోత్సహిస్తున్నాం.. ఉత్తరాంధ్రలో ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంటును తీసుకొస్తున్నాం. గత ఐదేళ్లలో నష్టపోయిందంతా వడ్డీతో తిరిగి తీసుకురావాలనేది లక్ష్యమన్నారు. పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నా. ఎన్ఆర్బలే మా బ్రాండ్ అంబా సిడర్లు, ప్రపంచంలో 80 శాతం ఉద్యోగాలు ఎంఎస్ఎంఈల ద్వారానే వస్తున్నాయి. పరిశ్రమలకు ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు అందుబాటులో ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద. ఎత్తున పెట్టుబడులకు ముందుకు రావాలి. పరిశ్రమలకు అండగా నిలబడే బాధ్యత కూటమి. ప్రభుత్వానిదని మంత్రి లోకేశ్ అన్నారు .
నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల సారాంశం ఏమిటి?
మంత్రి నారా లోకేష్ తన వ్యాఖ్యలో, ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువారు ఉన్నారని, వారి గుర్తింపు అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అన్నారు. ఆయన నాయకత్వం ద్వారా తెలుగు ప్రజలు టెక్నాలజీ, అభివృద్ధి, విద్య, పారిశ్రామిక రంగాల్లో విశ్వవ్యాప్తంగా నిలదొక్కుకున్నారని ప్రశంసించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Srisailam Reservoir: శ్రీశైలం జలాశయం వద్ద పోటెత్తిన వరద ప్రవాహం