ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం చోటుచేసుకున్న ఒక ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీ భద్రతా సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక మార్షల్ టీడీపీ ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ, లోకేశ్ సిబ్బందిని కఠినంగా హెచ్చరించారు.
ఎమ్మెల్యే నరేంద్రపై మార్షల్ దురుసు ప్రవర్తన
అసలు విషయానికి వస్తే, అసెంబ్లీ లాబీలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) మీడియాతో మాట్లాడుతుండగా, అక్కడికి వచ్చిన ఓ మార్షల్ ఆయనను అడ్డుకున్నారు. “లాబీలో ఎవరూ ఉండకూడదు” అంటూ గట్టిగా హెచ్చరించిన మార్షల్, నరేంద్రపై చేయి వేసి, అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రవర్తనతో ఎమ్మెల్యే తీవ్ర అసహనానికి గురయ్యారు.

లోకేశ్ జోక్యం – “ఇది తాడేపల్లి పాలనా కాదు!”
ఈ సమయంలో తన ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన మంత్రి నారా లోకేశ్, మార్షల్ ప్రవర్తనను గమనించి తక్షణమే జోక్యం చేసుకున్నారు. “ఇంకా తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace) పాలనలో ఉన్నట్టు భావిస్తున్నారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బందిని ఉద్దేశించి, ఎమ్మెల్యేల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని, వారి విధులకు పరిమితంగా ఉండాలంటూ స్పష్టంగా హెచ్చరించారు.
“విధుల పరిమితిని మించి ప్రవర్తిస్తే సహించేది లేదు”
లోకేశ్ మాట్లాడుతూ, “పాసులు లేని వ్యక్తులు లోపలికి రాకూడదని చూడటం మీ పని. కానీ ఎన్నికైన సభ్యులపై చేయి వేయడం అనుచితం” అని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: