Father suicide case: కొత్త సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించాల్సిన వేళ నంద్యాల(Nandyal crime) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉయ్యాలవాడ మండలం తొడుములదీన్నేల గ్రామంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అమానుషానికి పాల్పడి తన ముగ్గురు చిన్నారుల ప్రాణాలు తీసాడు. వివరాల్లోకి వెళితే
Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు

ముగ్గురు చిన్నారులు మృతి
వేములపాటి సురేంద్ర (34) అనే వ్యక్తి తన పిల్లలు కావ్యశ్రీ (7), ధ్యానేశ్వరి (4), సూర్య గగన్ (2)లకు విషపదార్థం కలిపిన పాలను తాగించినట్లు పోలీసులు తెలిపారు. దీనివల్ల ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అనంతరం సురేంద్ర కూడా ఆత్మహత్య(suicide)కు పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటనకు గల కారణాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: