ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులు తిరిగి పునరుద్ధరించబోతున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. సినీ రంగానికి ఉత్సాహాన్నిచ్చే ఈ ప్రకటన, ‘భైరవం’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన చేసిన కీలక వ్యాఖ్యల్లో భాగంగా వెలువడింది.

ఓ చలనచిత్ర వేడుకలో ప్రకటన-సినిమా రంగానికి ప్రోత్సాహకంగా నంది అవార్డులు
ఆదివారం సాయంత్రం ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమం, సినిమా ప్రమోషన్‌కు మించి, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర రంగానికి ఓ ఉత్సాహాన్ని నింపింది. ప్రముఖ నటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలలో నటించిన ‘భైరవం’ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ- రాబోయే రోజుల్లో విశాఖపట్నంని కూడా చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయటానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చాలా కాలంగా నంది అవార్డులను మరుగునపడేశారని, తిరిగి పునరుద్ధరించి అతి త్వరలోనే పురస్కారాలను అందజేస్తామన్నారు. త్వరలోనే చిత్ర పరిశ్రమ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
నూతన ఫిల్మ్ పాలసీ
దీనికి సంబంధించి స్టూడియోల నిర్మాణాలు, డంబింగ్, రీరికార్డింగ్ చేయటంలో నిర్మించడానికి సపోర్ట్ ఇవ్వటానికి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఫిల్మ్ పాలసీ తీసుకురావడానికి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి చెందిన భౌగోళిక, ప్రకృతిసౌందర్య వనరులను ఉపయోగించి, సినిమా షూటింగ్స్ సులభంగా జరగేలా చేయడమే లక్ష్యంగా తీసుకుంటున్నారు. నంది అవార్డులు పునరుద్ధరణతో, తెలుగు సినిమా మరియు టెలివిజన్ రంగంలో ఉన్న ప్రతిభావంతులకు గుర్తింపు లభించనుంది. గతంలో నంది అవార్డులు చెయ్యని విధంగా రాజకీయ కారణాల వల్ల మూడేళ్లు నిలిపివేయబడ్డాయని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని తిరిగి ప్రారంభించడం కళారంగానికి గౌరవాన్ని తిరిగి తీసుకురానుంది.
ట్రైలర్ వేడుక
భైరవం సినిమా సూపర్ హిట్ కావాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కథనాయకులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, నిర్మాత రాధా మోహన్, సహ నిర్మాత శ్రీధర్, కథానాయికలు అతిథి శంకర్, నందిని, నటుడు అజయ్, మంత్రి కందుల దుర్గేష్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్మేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, అంబికా సంస్థల అధినేత, నిర్మాత అంబికా కృష్ణ తదితరులు హాజరయ్యారు. ఆహ్లాదరకమైన వాతావరణంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. తొలిసారిగా ఏలూరులో ఇంత పెద్ద ట్రైలర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో సందడి నెలకొంది.
Read also: Nandigam Suresh: నందిగం సురేశ్ అరెస్ట్ పై స్పందించిన తుళ్లూరు డీఎస్పీ