కడపలో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు(Mahanadu)లో నందమూరి కుటుంబ సభ్యుల గైర్హాజరు చర్చనీయాంశంగా మారింది. ప్రతి సంవత్సరం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొనే నందమూరి బాలకృష్ణ కూడా ఈసారి మహానాడుకు హాజరుకాలేదు. ఆయన లేకపోవడమే కాక, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామకృష్ణ, చైతన్య కృష్ణ వంటి ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎవరూ కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యానికి గురి చేసింది.
అభిమానులలో ఆందోళన – కారణాలపై చర్చ
నందమూరి వారసులు (Nandhamuri Family) మహానాడుకు ఎందుకు దూరంగా ఉన్నారన్న విషయంపై అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమ అభిమాన నాయకులు ఎందుకు హాజరుకాలేకపోయారన్న విషయంపై సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి కీలక సమావేశానికి కుటుంబ సభ్యులు దూరంగా ఉండటం వెనుక ఏమేమి కారణాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అభిమానులలో మొదలైంది. కొన్ని వర్గాలు ఇది వ్యక్తిగత కారణాల వల్ల అయ్యుంటుందని భావిస్తున్నాయి.
రాజకీయ సంకేతాలేనా? – అనుమానాలు వెల్లువ
నందమూరి కుటుంబం పూర్తిగా గైర్హాజరు కావడం వెనుక రాజకీయ అర్థాలున్నాయా? అనే సందేహాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇప్పటికే రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ, బాలకృష్ణ వంటి నేతలు ఈ తరహా సభలకు హాజరవ్వకపోవడం పార్టీ లోపలి పరిణామాల వైపే చూపిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారం పట్ల తెలుగుదేశం పార్టీ నుంచి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.
Read Also : Mamata Banerjee : ప్రధాని మోదీకి సవాల్ విసిరిన మమతా!