కడప కార్పొరేషన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) సారధ్యంలో భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివి ఎన్.మాధవ్ (N. Madhav) అన్నారు. 2028 నాటికి, భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కవి వేమన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు
రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ (bjp State President Madhav) కడప జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఉదయం శివ శివాని స్కూల్ గ్రౌండ్ లో ఆసనాలు చేశారు. అనంతరం వాయుపుత్ర కేఫ్ లో కార్యకర్తలతో ఛాయ్ పే చర్చా కార్యక్రమం (Chai Pe Discussion Program) లో స్థానిక పరిస్థితులపై చర్చించారు. తొలి గడప దేవుని కడపలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని సారధ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సహజ కవి యోగి వేమన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డి, శిశు భూషణ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ యాదవ్, బీరం సుబ్బారెడ్డి, సింగారెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంట్ ఇంచార్జ్ బొమ్మన సుబ్బరాయుడు, దిశగా కార్యకర్తలతో యోగి వేమన, వై జంక్షన్ నుంచి ఆదిత్య ఫంక్షన్ హాల్ వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లారు. విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ (N. Madhav) మాట్లాడుతూ రానున్న రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన ఆలోచనలు, ప్రణాళికలను కార్యకర్తలతో పంచుకుంటున్నట్లు చెప్పారు. 11 ఏళ్ల మోదీ పాలన (11 years of Modi rule) లో దేశం భలే శక్తిగా ఎదిగిందని, అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. జాతీయ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. దేశ జిడిపి పెరుగుతుందన్నారు.
భారతదేశానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తు లభించింది అన్నారు. దేశ సంస్కృతిని పరిరక్షిస్తుందని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంతో పాటుగా రాయలసీమ జిల్లాలకు కేంద్రం నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. కొప్పర్తి పారిశ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించిందన్నారు. కడప ఎయిర్పోర్ట్ సుందరీకరణ, కడప రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. ప్రతి గ్రామానికి బిజెపి జెండా వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీలో అందరికీ సమున్నత స్థానం లభిస్తుందని, సాధారణ కార్యకర్తను అయినా నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా చేశారన్నారు. కార్యకర్తలు అందరికీ గుర్తిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి, శశి భూషణ్ రెడ్డి, నాయకులు లంకా దినకర్, శ్రీనాథ్ రెడ్డి, సింగారెడ్డి రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, చలపతి, బొమ్మన సుబ్బరాయుడు, బాలకృష్ణ యాదవ్, బిరం సుబ్బారెడ్డి, మునగ సతీష్, శాలివాహన, లక్ష్మణరావు, అమర్నాద్ రెడ్డి, పవన్ కుమార్, బొమ్మన విజయ్, సురేంద్ర, ప్రవీణ్, కళ్యాణ్, కృష్ణారెడ్డి, చాగలమర్రి ఓబులేసు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Andhra Pradesh: ఏపీ లో పెట్టుబడికి ఎవర్సెండై కార్పొరేషన్