కడప జిల్లాలో దారుణం: భార్యను హత్య చేసిన భర్త
కడప జిల్లాలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న దారుణ ఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గండికోటలో మైనర్ బాలిక హత్య (Murder) కేసు మరువకముందే, చాపాడు మండలంలో మరో దారుణం జరిగింది. అక్రమ సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భార్యను భర్తే దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేసిన (Dropped in a forest area) ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఈ దారుణం బయటపడింది.
వివాహేతర సంబంధమే హత్యకు దారి
Murder: పెద్ద చీపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల గోపాల్, సుజాత దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులున్నారు. గోపాల్ ప్రైవేట్ ట్రావెల్స్‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, సుజాతకు కల్లూరుకు చెందిన తాపీ మేస్త్రీ చెన్నయ్యతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి (affairs) దారితీసింది. ఈ విషయం భర్త గోపాల్‌కు తెలియడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
కుటుంబ పెద్దలు, బంధువుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా సుజాత ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో గోపాల్ తన కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చాడు. కొంతకాలం అక్కడే నివాసం ఉన్నప్పటికీ, సుజాత మళ్లీ పెద్ద చీపాడుకు తిరిగి వచ్చి చెన్నయ్యతో సంబంధాన్ని కొనసాగించింది. ఇది గోపాల్ ఆగ్రహాన్ని మరింత పెంచింది.
నిద్రిస్తున్న భార్యను హత్య చేసిన భర్త
సుజాత ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన గోపాల్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రిస్తున్న సుజాతను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. హత్య అనంతరం, ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో వేసి స్కూటీపై మైదుకూరు మండలం పనిపెంట అటవీ ప్రాంతంలోని లోయలో పడేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు.

పోలీసుల ఎదుట లొంగుబాటు
హత్య చేసిన మరుసటి రోజు కడప పరిసర ప్రాంతాల్లో గోపాల్ సంచరించాడు. అనంతరం మైదుకూరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలో తిరిగాడు. పోలీసులకు లొంగిపోవాలని భావించినా ధైర్యం చాలలేదు. ఈ క్రమంలో, తనకు తెలిసిన ఓ హోంగార్డుకు విషయాన్ని వివరించగా, అతను స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవాలని సలహా ఇచ్చాడు. దీంతో గోపాల్ చాపాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు.
వెంటనే పోలీసులు గోపాల్‌ను వెంటబెట్టుకుని సుజాత మృతదేహం కోసం పనిపెంట అటవీ ప్రాంతంలో గాలించారు. శుక్రవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో, శనివారం ఉదయం మళ్లీ గాలించగా సుజాత మృతదేహం లభ్యమైంది. అప్పటికే రెండు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయింది. అక్కడే వైద్యులను పిలిపించి పోస్టుమార్టం నిర్వహించి, పంచనామా పూర్తి చేశారు. సుజాత భర్త గోపాల్‌పై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Cyber Crime: సైబరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్టు