ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టణ, నగర పాలక(స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజల జీవన ప్రమాణాల ను నేరుగా ప్రభావితం చేసేఅత్యంత కీలక ఘట్టాలు. ఈ పాలకవర్గాలు ప్రజల దైనందిన అవసరాలుతాగు నీరు, పారిశుధ్యం, రహదారులు, విద్యుత్, కాలుష్య రహిత పట్టణ, నగరాల అభివృద్ధి తదితరాలన్నీ స్థానిక పాలనతోనే ముడిపడి ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రం లో ఫిబ్రవరి 11న జరగనున్న పుర(నగర పాలక ఎన్నికలు రాజకీయంగానే కాదు, సామాజికంగా కూడా విశేష ప్రాధా న్యంసంతరించుకున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలకు,116 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో పట్టణ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పార్టీగుర్తులపై ఎన్నికలు జరుగుతున్నందున, అన్ని రాజకీయ పార్టీలు ఈ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆధిపత్యం కోసం పోటీపడుతు న్నాయి. అగ్ర నేతలను రంగంలోకి దించి, బహిరంగ సభలు, రోడ్లు, సమావేశాలతో పట్టణాలన్నీ రాజకీయ ఎన్నికల రంగస్థలా లుగా మారాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసు కుంది. అన్ని నగరపాలక సంస్థలు, అధిక శాతం పురపాలక సంఘాలను దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ప్రజల ముందుకెళ్తుంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి, పార్టీని సంఘ టితంగా ముందుకు నడిపిస్తున్నారు. గత రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధికార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అలాగే వచ్చే మూడేళ్లలో అమలు చేయబోయే ప్రణాళికలను ప్రజలకు వివరించడం కాంగ్రెస్ ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మా రింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిధులు అందకపోవడాన్ని ప్రస్తావిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తుచేస్తూ ప్రచారం కొనసాగిస్తోంది. అభివృద్ధి కావాలంటే స్థానిక సంస్థలలోనూ కాంగ్రెస్కే అధి కారం ఇవ్వాలి అన్న నినాదంతో ముందుకు వెళ్తుంది. కేంద్ర అధికారంతో పట్టణాలపై దృష్టి కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో జరుగు తున్న ఈ అర్బన్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించా లన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
Read Also : http://TVK Vijay : పవన్ కళ్యాణ్ బాటలో TVK విజయ్..?

బీజేపీ ప్రాతినిధ్యం
ఏడు నగరపాలక సంస్థలలో మూడు చోట్ల బీజేపీ ఎంపీలు ప్రాతి నిధ్యం వహించడం ఈపార్టీకి అదనపు బలంగా మారింది. నిజామాబాద్లో ఎంపీతోపాటు ఎమ్మెల్యేఉండగా, కరీంనగర్ నుంచి కేంద్రమంత్రి, మహబూబ్నగర్ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షురాలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు నగరాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. జాతీయ అధ్యక్షు డితోపాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకత్వం ప్రచారం లో పాల్గొంటూ రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలనే ప్రధాన అస్త్రంగా చేసుకున్నారు.నెరవేరని హామీలు, మోసపూరిత వాగ్దానా లంటూ కాంగ్రెస్పై విమర్శలు ఎక్కుపెట్టడంతో పాటు, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ను చీల్చే ప్రయత్నాలు కూడా సాగి స్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత పాలనపై నమ్మకంతో ముందడుగు ప్రతిపక్షంగా ఉన్నభారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గత పదేళ్లపాలనలో తాము చేప ట్టిన అభివృద్ధి కార్యక్రమాలనే ప్రధాన ఆయుధంగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ప్రజలు నిరాశ చెందుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నగరపాలక, పుర పాలక సంఘాల వారీగా ఇన్చార్ట్లను నియమించి, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ ప్రధాన నేతలు వ్యూహా త్మక దిశానిర్దేశం చేస్తూ, ఎక్కువ స్థానాలు దక్కించుకోవాల నే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్న విభేదాలు, అలాగే గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన పనులు ప్రజలకు ఇంకా గుర్తున్నాయన్న నమ్మకంతో ఈ ప్రభావం ఫలితాలపై పడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏడు (7) నగర పాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల ఎన్నికల్లో మొత్తం12,944 (ఏకగ్రీవలతో కలిపి)మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో పార్టీలవారీగా పోటీచేస్తున్న స్థానాలు గమనిస్తే రాజకీయ ఉత్సాహం ఏస్థాయిలో ఉందో అర్థమ వుతుంది. కాంగ్రెస్: 2,948 స్థానాలు (98.3 శాతం), బీఆర్ఎస్: 2,878 స్థానాల (96శాతం), బీజేపీ: 2,634 స్థానాలు (87.3శాతం), స్వతంత్రులు: 2,786
స్థానాలు (94శాతం), జనసేన: 332 (11.1 శాతం), మజ్లిస్ : 282 (9.4 శాతం), ఆస్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్: 288 (11.1 శాతం), బీఎస్పీ: 213 (7.1 శాతం), సీపీఐ:168 (5.6 శాతం), సీపీఎం: 108 (4.2 శాతం), ఐయూఎంఎల్:9 (0.3శాతం), 7, కార్పొరేషన్లు, పురపాలక వారీగా ఏడు కార్పోరేషన్ల పరిధిలో 414 డివిజన్ఉండగా 2,225 మంది పోటీలో ఉన్నారు. పురపాలికల వారీగా చూస్తే 116లో 10,719 మంది పోటీ చేస్తున్నారు. ఈ గణాం కాలు పట్టణ, నగర రాజకీయాల్లో ప్రధానపార్టీలతో పాటు స్వతంత్రుల ప్రభావం కూడా గణనీయంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి. శ్రీమంతుల ఆధిపత్యం ఖర్చుతో కూడిన రాజకీయాలు పుర(నగర) పాలక (Municipal elections)రులో మరో ముఖ్యమైన అంశంధనం ప్రభావం.

ఖర్చుతో కూడిన వ్యవహారం
గతంలో ప్రజాసేవ చేయాలన్న భావనతో సామాన్యులు, సామాజిక కార్యకర్తలు రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ ప్రస్తుతం ఎన్నికలు ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారడంతో, సమాజంపై అవగాహన, సేవాభావన ఉన్న చాలామంది పోటీకి వెనుకడుగు వేస్తు న్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన పార్టీలు ఆర్థికంగా బల మైన శ్రీమంతులకు, వ్యాపారవేత్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయన్నది నిర్వివాదాంశం. వ్యాపారాలు, మైనింగ్, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్రం గాల్లో ఉన్నవారు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి వస్తున్నారు. కొన్నిచోట్ల పార్టీ టిక్కెట్లు దక్కకపోయినా, స్వతంత్రులుగా బరిలోకి దిగినరు. వార్డు కౌన్సిలర్ పదవికన్నా, భవిష్యత్తులో చైర్మన్, అధ్యక్ష స్థానాలపై కన్నేసిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ పోటీతో ఎన్నికల ఖర్చు క్రమంగా పెరుగుతూ, సామాన్యులకు అందని స్థాయికి చేరుతోంది. యువత, మహిళలు పాల్గొన డం ఆశాజనక సంకేతం. ఈసారి పుర (నగర పాలక ఎన్నికల్లో (Municipal elections)యువరక్తం పెద్ద ఎత్తునముందుకొచ్చింది. మొత్తం 12,944 మంది అభ్యర్థుల్లో 56.1శాతం మంది 40ఏళ్లలోపుయువత ఉండటం విశేషం. వీరిలో దాదాపు 70శాతం మంది గ్రాడ్యు యేట్లు, అండర్గ్రాడ్యుయేట్లు కావడం పట్టణ పాలనపై చదువుకున్న యువత ఆసక్తి పెరుగుతున్నదానికి నిదర్శనం. అలాగే మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా ఉంది. ఈ ఎన్నికల్లో యువకులు, మహిళలు, శ్రీమంతులు, పోటీ చేసిన వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకో బోతున్నారు. కానీ అసలు కీలకపాత్ర మాత్రం ఓటర్లదే. ప్రచార ఆర్భాటాలు, హామీల వర్షం, వ్యక్తిగత ప్రలోభాలకు లోనుకాకుండా, తమ నగరాలపట్టణాల అభివృద్ధికి నిజంగా పని చేసే వారి ని ఎంపిక చేయాల్సిన బాధ్యత ఓటర్లపై ఉంది. నేటి ఓటు రేపటి ఐదేళ్ల పట్టణాల (నగరాల అభివృద్ధికి తోడ్పడుతూ.. ప్రజలకు సేవకులుగా, పాలకుల ఒప్పందం-లాంటిదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మంచి నాయకత్వాన్ని ఎంచు కున్నప్పుడే పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అందుకే విచ క్షణతో, స్వేచ్ఛగా మీ ఓటును వినియోగించండి. ప్రజా గెలుపే ప్రజాస్వామ్యానికి నిజమైన గెలుపు..
-మెకిరి దామోదర్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: