విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోన్న ఎపి లిక్కర్ స్కాం (AP Liquor Scam)కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఆదే శాలు జారీ చేసింది. ఈ కేసులో ఎంపి పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ ఎసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అయితే, సిట్ పిటిషన్పై నేడు ఎసిబి హైకోర్టు (ACB High Court)విచారణ చేపట్టింది. మిథున్రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు రోజుల పాటు అంటే ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇక, ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రేపు అనగా సెప్టెంబర్ 19న ఉదయం 8 గంటలకు మిథున్రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకితీసుకోనున్నారు. రెండు రోజుల పాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: