బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ టీటీడీ (TTD) వ్యవహారాల్లో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.గత ప్రభుత్వ హయాంలో టీటీడీ పాలకమండలి అవినీతిమయమైందని, గతంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసిందని, స్వామి వారి లడ్డూలో జరిగిన కల్తీతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. తాను గత పాలనలో టీటీడీలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాస్తానని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు లక్ష్మణ్ (MP Laxman).

భక్తుల్లో ఆందోళన
ఆయుర్వేద మందులను తయారీ చేసే యంత్రాలు రూ.3.90 కోట్ల రూపాయలను పెట్టి నాసిరకం యంత్రాలను కొన్నారు పరకామణి,అన్నదానంలో నాసిరకం భోజనం, ఆయుర్వేదం ఫార్మసీలో యంత్రాల కొనుగోలు, లడ్డూ (Laddu) ల్లో కల్తీ వంటివి భక్తుల్లో ఆందోళన కలిగిస్తుంది’ అన్నారు. లక్ష్మణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Read Also: Nara Lokesh: వెల్వడం ఊరి ప్రజలకు క్షమాపణలు చెప్పిన మంత్రి నారా లోకేష్