సినిమా అంటే తెలుగు వారికి ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ను క్యాష్ చేసుకునే క్రమంలో టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సినిమా ఇప్పుడు కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక ఖరీదైన వ్యసనంగా మారిపోయిం ది. ఒకప్పుడు సామాన్యుడికి అతి తక్కువ ఖర్చుతో దొరికే ఏకైక ఉపశమనం సినిమా. కానీ నేడు, థియేటర్ గడప తొకా్లంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సినిమా టిక్కెట్ల (Movie ticket) ధరల పెంపు, ప్రభుత్వ జీవోలు (బివ్బీ), పైరసీ వెబ్సైట్ల పట్ల ప్రజల మొగ్గు వంటి అంశాలు సమాజంలో ఒక లోతైన చర్చకు దారితీస్తున్నాయి. తెలుగు రాష్ట్రా ల్లో సంక్రాంతి పండుగ అంటేనే థియేటర్ల వద్ద సందడి, స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాల జాతర అయితే ఈ ఏడాది వినోదం సామాన్యుడికి మరింత భారం అయింది. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో ఈ సమస్య తీవ్రరూపం దాల్చింది. గతంలో సినిమా టిక్కెట్ల ధరల పెంపును, బెనిఫిట్ షోలను అడ్డుకుంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఇటీవల డివిజన్ బెంచ్ స్టే విధిం చింది. ప్రభుత్వాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంక్రాంతి బరిలో ఉన్న భారీ చిత్రాల నిర్మాతలు టిక్కెట్ (Movie ticket)రేట్లు పెంచుకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఒక నలుగురు సభ్యులున్న మధ్య తరగతి కుటుంబం సినిమాకు వెళ్లాలంటే, టిక్కెట్ల కోసం కనీసం రెండు వేల రూపాయలు, మరి కొంత స్నాక్స్, పార్కింగ్ కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంత మొత్తం ఖర్చును ఒక పూట వినోదం కోసం నెలవారీ బడ్జెట్లో కోత పెట్టాల్సి వస్తోంది. ఇది వారిపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఈ అధిక ధరల కారణంగా, చాలా కుటుం బాలు థియేటర్లకు వెళ్లడం మానేసి, పైరసీ సైట్లకు, ఓటీటీ ప్లాట్ఫామ్లు లేదా టీవీలకు పరిమితమవుతున్నాయి.

చిత్ర పరిశ్రమకే నష్టం
ఓటీ టీలు పైరసీ వైపు ప్రేక్షకులు మొగ్గు చూపడం వల్ల దీర్ఘకాలంలో చిత్ర పరిశ్రమకే నష్టం! ఈ బెనిఫిట్ షోల నిర్వ హణ, టిక్కెట్ల ధరల వివాదానికి ఏడాది క్రితం హైదరా బాద్లోని ప్రముఖ థియేటర్వద్ద జరిగిన తొకిసలా ఘటన నిదర్శనంగా నిలిచింది. విడుదల సందర్భంగా నెలకొన్న పరిస్థితి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ఉండే ధరలకు భిన్నంగా, అభిమానుల ఆనందాన్ని, హైప్ని సొమ్ము చేసుకునేలా టిక్కెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచే శారు. అభిమానులు అతి ఉత్సాహం, ఆనందం ఒకవైపు ఉంటే.. ఈ పరిస్థితిని అడ్డంపెట్టుకుని థియేటర్ యాజ మాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న వ్యాపారంపై తీవ్ర విమ ర్శలు వెల్లువెత్తాయి. ఇష్టానుసారం ప్రదర్శించిన బెనిఫిట్ షో, స్టార్ల హైప్,అభిమానులు వెర్రి ఆనందం విపరీత పరిణామాల కారణంగా జరిగిన సినిమా తొక్కిసలాట ఘట నలో ఓ మహిళా అక్కడికక్కడే మృతి చెందగా, ఆవిడ కుమారుడు తీవ్ర అస్వస్థతతో ప్రాణాల నుండి బయటప డ్డాడు. ఈ సమస్య కేవలం సినిమా పరిశ్రమకే పరిమితం కాలేదు. దీని తీవ్రత ప్రభుత్వాన్ని కూడా కదిలించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తమ ప్రయోజనాల కోసం సినిమా టిక్కెట్ల రేట్లు పెంచి ప్రేక్షకులను దోచుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు.

టిక్కెట్ల పెంపు
ముఖ్యంగా టిక్కెట్ల పెంపు, బెనిఫిట్ షోల పేరిట జరుగుతున్న దోపిడీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పిన మాటలు ఒక ఆశాజనక మార్పుగా కనిపించాయి. అయితే, క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం ఇంకా అలాగే ఉంది. ప్రభుత్వం గతంలో రేట్లు పెంచవద్దని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించినా, తాజాగా సినిమాలకు ఇచ్చిన ధరల పెంపు ఉత్తర్వులు ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనం! ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు పొంది రేట్లు పెంచుతున్న క్రమంలో, అది కేవలం బడా నిర్మాతలకే లాభం చేకూరుస్తోందనే ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సగటు అభిమానిపైరసీ వైపు మొగ్గు చూపుతున్నారు. థియేటర్లలో టిక్కెట్ రేట్లు భరించలేనంతగా పెరగడం వల్లే సామాన్యులు ఉచితంగా సినిమాలు అందించే పైరసీ సైట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ఉచితంగా సినిమాలు
అందించే అడ్మినిస్ట్రేటర్ అరెస్ట్ అయినప్పుడు, సోషల్ మీడియాలో నెటిజన్లు అతనికి మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది. ‘వందల రూపాయల టిక్కెట్ కొనలేని మాకు ఉచితవినోదం అందించిన వాడు నేరస్తుడా?’ అనే ప్రశ్నే అక్కడ వినిపించింది. ఇది వ్యవస్థ వైఫల్యానికి ఒక సంకేతం. చట్టపరంగా పైరసీ తప్పు అయి నప్పటికీ, అధిక ధరలు సామాన్యుడిని ఆ వైపు నెడుతున్నా యనేది నగ్న సత్యం. ఇది ఒక రకంగా సినిమా పరిశ్రమకు ప్రభుత్వాలకు చెంపపెట్టు. ప్రేక్షకుడు పైరసీని ప్రేమిస్తున్నాడంటే, దానర్థంసినిమా పరిశ్రమ సామాన్యుడికి దూరం అవుతోందనే కదా?! సినిమా బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధరల సమస్యకు తక్షణమే ఒక శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వం జీవోలు ఇచ్చి రేట్లు పెంచడానికి సహకరించడం కాకుండా, కనీస ధరలను నియంత్రించాల్సిన బాధ్యత తీసుకోవాలి. అదే సమయంలో, సినిమా పరిశ్రమ కూడా సామాన్య ప్రేక్ష కుడి జేబుకు చిల్లు పడకుండా, అందరికీ అందుబాటులో ఉండేలా టిక్కెట్ల ధరలను నిర్ణయించాలి. అప్పుడే సినిమా పరిశ్రమ మనుగడ సాగుతుంది, ప్రేక్షకుల ఆదరణ నిలబడుతుంది. కేవలం ‘స్టార్డమ్’ పేరుతో థియేటర్లలో దోపిడీ కొనసాగితే, భవిష్యత్తులో థియేటర్లు ఖాళీగా ఉండి, ప్రజలు పైరసీ వెబ్ సైట్ల వైపే చూస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పరిశ్రమ కలిసి కూర్చుని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుని, ఈ టిక్కెట్ల ధరల చిచ్చుకు శాశ్వత తెరదించాలి.
-దిడ్డి శ్రీకాంత్