‘మొంథా’ తుపాను(Montha Cyclone effect) నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ శాఖ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. తుఫాను ప్రభావిత జిల్లాల్లో విద్యుత్ సరఫరాలో(power supply) అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు ప్రారంభించారు. అవసరమైన సామాగ్రి, సాంకేతిక సిబ్బంది, ప్రైవేట్ కాంట్రాక్టర్లను తక్షణ మరమ్మతుల కోసం ఇప్పటికే తరలించారు. అదనంగా, కమ్యూనికేషన్ సౌకర్యాల కోసం వాకీటాకీలు, జెనరేటర్లు అందుబాటులో ఉంచారు. అన్ని డిస్కంల పరిధిలో 24 గంటలు పని చేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటయ్యాయి.
Read Also: Govt Negligence: తుఫాను సహాయక చర్యలపై వైసీపీ మండిపాటు

విపత్కర పరిస్థితుల్లోనూ విద్యుత్(Montha Cyclone effect) సేవలు కొనసాగించేందుకు సిబ్బందికి సెలవులు రద్దు చేయబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడు డిస్కంలలో మొత్తం 1,000 బృందాలు, సుమారు 12,000 మంది సిబ్బంది అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉన్నారు.
ఈపీడీసీఎల్ పరిధిలో ప్రధాన ప్రభావం:
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, తుపాను ప్రభావం ఎక్కువగా ఈపీడీసీఎల్ పరిధిలో ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఎస్‌పీడీసీఎల్ పరిధిలోని సిబ్బంది, సామాగ్రిని అక్కడికి తరలించారు. విశాఖపట్నం, ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 496 బృందాలు, 7,394 మంది సిబ్బంది మరమ్మతుల పనులకు సిద్ధంగా ఉన్నారు.
సీపీడీసీఎల్ & ఎస్‌పీడీసీఎల్ సన్నద్ధత:
సీపీడీసీఎల్ పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 285 కాంట్రాక్టర్లు, 2,913 మంది వర్కర్లు నియమితులయ్యారు. ఎస్‌పీడీసీఎల్ పరిధిలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని తీర మండలాల్లో ప్రభావం ఉండే అవకాశంతో 10 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
విద్యుత్ ఉత్పత్తి నిరంతరత:
తుపాను కారణంగా థర్మల్ స్టేషన్లలో ఉత్పత్తి ఆగిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. విజయవాడ వీటీపీఎస్‌లో వరద నీటిని తొలగించేందుకు 104 పంపులు సిద్ధంగా ఉంచగా, కడప ఆర్‌టీపీపీ, కృష్ణపట్నం ప్లాంట్లలో కూడా తగిన మోటార్లు ఏర్పాటు చేశారు.
సీఎస్ విజయానంద్ ఆదేశాలు:
విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణ చేపట్టాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. తుపాను సన్నద్ధతపై డిస్కంల సీఎండీలు, జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సీఎం చంద్రబాబు సమీక్ష:
తుపాను ప్రభావంతో ప్రజా ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర స్థితిగతులపై ప్రధాని నరేంద్ర మోదీతో కూడా చర్చించారని చెప్పారు. కేంద్రం అవసరమైన సహాయం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారని వెల్లడించారు. పీఎంఓతో సమన్వయం బాధ్యతను మంత్రి నారా లోకేశ్‌కు అప్పగించారు. తుపాను రక్షణ చర్యల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం ఉదయం ఆర్టీజీఎస్ ద్వారా జిల్లాల పరిస్థితులను సమీక్షించిన సీఎం, రియల్‌టైమ్ సమాచారం అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో త్వరిత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: