ఆంధ్రప్రదేశ్(Mohan Krishna) ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అమెరికా పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ కూడా పాల్గొన్నారు. మోహన్ కృష్ణ వివరించినట్లుగా, లోకేష్ ఉదయం నుంచి రాత్రి వరకు దిగ్గజ కంపెనీల సీఈవోలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ పర్యటన ఏపీలో వేల కోట్ల పెట్టుబడులకు పునాదిగా మారబోతోంది. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడడం కోసం లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారు.
Read also: రాష్ట్రంలో 26 లక్షల ఉద్యోగావకాశాల కల్పన

విశాఖపట్నం కొత్త ప్రాజెక్టులు
యూఎస్ పర్యటనలో(Mohan Krishna) గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో సమావేశమై విశాఖలో $15 బిలియన్ డాలర్ల ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ప్రారంభంపై చర్చించారు. ఇంటెల్ సంస్థతో అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ATMP) యూనిట్ ఏర్పాటు పై చర్చలు జరిగాయి. అంతేకాక, అగ్రగామి సంస్థ ఎన్ విడియా, అడోబ్, జూమ్ సంస్థల ప్రతినిధులతో భేటీ కావడం ద్వారా విశాఖపట్నం, అమరావతి ప్రాంతాల్లో ఆర్ & డి, డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ప్రేరణ పొందాయి. మోహన్ మోహన్ కృష్ణ తెలిపారు, ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా ఎదగడానికి దోహదం అవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: