పుట్టపర్తి టౌన్ : భారతీయ జనతా పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో జరిగిన శోభయాత్ర మరియు విసృతస్థాయి కార్యకర్తల సమావేశం ఉత్సాహంగా జరిగింది. గురువారం జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ఎన్ మాధవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్(Modi&Satya Kumar), ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పట్టణంలోని విద్యాగిరి నుండి ఆర్.వి.జే. కళ్యాణ మండపం వరకు జరిగిన శోభయాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం జరిగిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి సత్య కుమార్ యాదవ్(Minister Satya Kumar Yadav)
మాట్లాడుతూ, దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన జవహర్లాల్ నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీ(narendra modi) మొదటి స్థానంలో ఉన్నారన్నారు. మోదీ(Modi&Satya kumar) నాయకత్వంలో భారతదేశ పటం పై తన గుర్తింపు మరింత బలంగా చాటిందన్నారు. ఇది ప్రతి దేశ పౌరునికి గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. నిబద్ధతతో పని చేసినందుకే రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్కి అవకాశం దక్కిందన్నారు. ఆయనకు నిబద్ధత అహంభావం లేని ఆచరణ కార్యకర్త స్థాయిలో మొదలై విశ్వాస ప్రయాణం ఫలితమేనన్నారు.

Read also: