हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

News Telugu: Modi: పుట్టపర్తికి ప్రధాని రాక నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు..

Rajitha
News Telugu: Modi: పుట్టపర్తికి ప్రధాని రాక నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు..

శతజయంతి వేడుకల ఏర్పాట్లపై సిఎం చంద్రబాబు సమీక్ష. విజయవాడ : శ్రీసత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19న పుట్టపర్తి (puttaparthi) కి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రపతి సహా వివిధ ప్రముఖులు హాజరుకానున్న దృష్ట్యా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సత్యసాయిబాబా జయంతి వేడుకల నిర్వహణపై సచివాలయంలో మంత్రులు, సీఎస్ విజయానంద్, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పుట్టపర్తికి ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, పట్టణాన్ని సుందరంగా అలంకరించాలని సీఎం సూచించారు. ఏర్పాట్ల పర్యవేక్షి మంత్రుల కమిటీ పుట్టపర్తిలో పర్యటించాలని ఆదేశించారు.

Read also: YS Jagan: వ్యక్తిగత హాజరు ఇవ్వాలన్న మినహాయింపు: హైకోర్టు

Modi

Modi: పుట్టపర్తికి ప్రధాని రాక నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు..

అసౌకర్యం కలగకుండా

శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నందుకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సత్యసాయిబాబా మహాసమాధి దర్శన నిమిత్తం పుట్టపర్తి నిలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వచ్చే వాహనాలకు అధికారికంగా పార్కింగ్ తో పాటు పట్టణంలో రాకపోకల ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. బాబా మహాసమాధి దర్శనానికి ఎంత మంది భక్తులు రావచ్చనేదానిపై అంచనా వేసి అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల కోసం అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ముందుస్తు జాగ్రత్తగా మెడికల్ క్యాంపులు సైతం ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. పుట్టపర్తిలోని వేర్వేరు ప్రాంతాల్లో 10 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలియజేశారు. పారిశుద్ధం విషయంలో ఎలాంటి నిరక్ష ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పుట్టపర్తికి వచ్చే భక్తులకు చిన్నపాటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870