ఆంధ్రప్రదేశ్ (AP) లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSME) ప్రభుత్వం కొత్త శక్తిని అందించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్ర అభివృద్ధిలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, వీటికి అవసరమైన ఆధునిక సదుపాయాలను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం (AP) కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCs) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒకే రకమైన పరిశ్రమలు ఉన్న క్లస్టర్లలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనుంది.
Read Also: AP Cabinet: ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చలు

కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు
ఈ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఒక్కో క్లస్టర్‌కు సుమారు ₹10 కోట్లు వెచ్చించనుంది. ఈ క్రమంలో ఇప్పటికే పరిశ్రమల శాఖ ప్రాథమిక రూపరేఖలను సిద్ధం చేసింది. సెంటర్‌లో ఆధునిక యంత్రాలు, కొత్త డిజైన్‌లు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D), టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, నైపుణ్య శిక్షణ (Skill Training), మార్కెటింగ్ సపోర్ట్, క్వాలిటీ కంట్రోల్ వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉండనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: