ఎప్పటివలెనే ఈసారి కూడా ‘కాప్’ సదస్సు ఎలాంటి ప్రాధాన్యతా నిర్ణయాలు తీసుకోకుం డానే అయిందనిపించింది. బ్రెజిల్లో బెలేమ్ ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో కాన్ఫరెన్స్ ఆప్పార్టీస్’ 30వ సదస్సు జరిగింది. ఇంతవరకు జరిగిన ‘కాప్ సదస్సులన్నిటిలో 2,3 తప్పితే వేరే ఏవిధమైన కీలక నిర్ణయాలు తీసుకోకుండానే మొక్కుబడిగా ముగిసాయి. 2030నాటికి శిలాజ ఇంధనాలపై ఆధారపడకుండా కాలుష్య ఉద్గారాలను తగ్గించుకునే క్రమంలో ఈ సదస్సు (Conference)లు జరుగుతున్నాయి. మితిమీరిన శిలాజ ఇంధన విని యోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాయుకాలుష్యం బాగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. పునరుజ్జీవన శక్తిని మూడు రెట్లు పరిణామానికి పెంచుకోవడమే లక్ష్యంగా జరిగే సదస్సులో 2015నాటి పారిస్ ఒప్పంద లక్ష్యాలపై ఆయా దేశాల పురోగతిని చర్చించుకునేవారం. కాని మారిన దేశ కాలమాన పరిస్థితుల రీత్యా ఏదేశం ఏమేరకు లక్ష్య సాధనకు చేరిందో చూసి భవిష్యత్ ప్రణాళికలను రూపొం దించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉద్గారాల విష యమై అమెరికా ఐరాస నిర్ణయాధికారాన్ని త్రోసిపుచ్చింది. ఆదిలో వాతావరణ ఒప్పందాల విషయంలో ఎంతో జాగ రూకతతో వ్యవహరించిన అమెరికా రానురాను సదస్సు(Conference) నిర్ణయాలనువిబేధిస్తూ వచ్చింది. అందుకే శ్వేత సౌధా ధినేత ట్రంప్ ఆఖరుకి ఈ యేడాది మొదట్లో తమ దేశం పారిస్ ఒడంబడికలు 2015 నుంచి బయటకు వచ్చేస్తున్న ట్లు ఇకపై జరిగే సదస్సుల నిర్ణయాలతో తమకేమీ సం బంధం లేదని ట్రంప్ స్వయంగా చెప్పారు. గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల విషయమేకాదు ఆర్థిక సంబంధిత అంశా లపై కూడా ఇతర దేశాలన్నీ స్పందించాయి. గత సదస్సు లోనే భారత్, సౌదీ అరేబియాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వర్ధమాన దేశాలకు బాగా నిధుల కొరత ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో వర్ధమాన దేశాలు చేతులు కలిపింది అందుకే. సదస్సుల్లోనూ, ప్రయోగాత్మ కంగానూ ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవ డానికి ముందడుగు వేసేందుకు ఈసదస్సులే సహకరిస్తు న్నాయి. వర్థమాన దేశాలకు సదస్సు లక్ష్యాలను నెరవేర్చు కునేందుకు అవసరమైన నిధులు లేవు. అమెరికా తాను ఇష్తానన్న నిధుల్లో తొలి విడత మాత్రమే ఇచ్చింది. తాజా పరిస్థితుల్ని బట్టి ఇకపై అమెరికా నుంచి నిధులు ఆశించ లేదు. ఇది మిగిలిన దేశాలకు కూడా అవకాశంగా మారు తుంది. సమష్టి కృషి నినాదంతో ఈ సదస్సు జరిగినా ఫలితం చెప్పుకోడానికేమీ లేదనే చెప్పాలి. పారిస్వగ్దానం అమలు, ఆచరణ క్రమంలో ప్రత్యేక దృష్టి సారించాలి. గ్లోబల్ క్లైమేట్ విషయంలో పర్యావరణ పరిరక్షణచర్యలు, క్లైమేట్ మార్పుపై తీసుకోదగిన చర్యలు చర్చించుకోవాల్సి ఉంది. చర్వితచరణంగా పారిస్ 2015 ఒడంబడికలోని అంశాలనే చర్చించుకున్నాయి. వివిధదేశాల మధ్య ఐక్యత లోపించడం అంతకన్నా ముఖ్యంగా నిధుల లేమి గురించి చర్చలు సాగాయి. ప్రపంచ దేశాలు 1.5డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత పెరుగుదలను నియంత్రించుకోవాల్సి ఉంది. శిలాజ ఇంధనాల వినియోగంలో కొన్నిసందేహాలకు నివృత్తిలేదు. భూగోళం వేడక్కడానికి శిలాజ ఇంధన వాడకమేనన్నది తేటతెల్లమైనా కొన్ని వర్ధమాన దేశాలు ఈ విషయంలో ఒక స్థిరమైన అభిపాయానికి రాలేదు. శిలాజ ఇంధనాల విషయమై సదస్సు ద్వారా కాక బయటి నుంచే వివిధ దేశాలు నిర్ణయం తీసుకుంటారని ప్రకటించడం వల్ల దాని గురించి చర్చించేదేమీ లేకపోయింది. కాగా వచ్చే యేడాది ఏప్రిల్లో మరో సదస్సు జరుగనుంది. ఆ సదస్సులో మరికొన్ని అంశాలమీద వివిధదేశాలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తాయి. వర్ధమాన దేశాలకు వాతావరణ సంక్షో భాన్ని ఎదుర్కొనే ప్రస్తుతమున్న ఆర్థిక సహాయం పెంచే విషయంలో హామీదొరకలేదు. ప్రస్తుతం వివిధ దేశాలు సమకూర్చిన నిధులు 12వేల కోట్ల డాలర్లు. కాగా మరో 30 వేల కోట్లకు పెంచాలి. అలా జరిగితేనే వాతావరణ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు. సంపన్న దేశాలు తొలుత ఎంతో ఔత్సాహిక, హామీలిచ్చినా తర్వాత నిధుల ప్రస్తావనలో పాల్గొనలేదు. ఇప్పుడు అమెరికా ధోరణి వలన రానున్న సదస్సు పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పలేం. అభివృద్ధి దేశాల సహాయ నిరాకరణ వలన కర్బన ఉద్గారాలుతగ్గించడంలో ఎలాంటి పురోగతీ లేదు. పైగా ప్రకృతి బీభత్సాలు అడవుల విధ్వంసం కార్చిచ్చులు కారణంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. శిలాజ ఇంధనాల సంగతిసరేసరి. ఇతరాత్ర ప్రకృతి పరి హాసాలు దేశీయుల్ని నవ్వులపాలు చేస్తోంది. ఇప్పుడు సదస్సు అటవీ ప్రాంతంలో జరిగిన విషయం తెలిసింది. సదస్సు వేదిక ఎంపికలో నిర్వాహకాలు మంచి ఆలోచన చేసినట్లు భావించాలి. దీనితో అడవుల నిర్మూలన గురించి వాటి పర్యవసానాల గురించి 92 దేశాలకు తెలియ చెప్పడమే ఇది. ఉష్ణమండల అరణ్యాల రక్షణ విషయమై వివిధదేశాలకు తేటతెల్లం చేయాలన్న ఉద్దేశంతో బ్రెజిల్ ఏకంగా ఈ సదస్సును తమ దేశంలోని అటవీప్రాంతం లో సదస్సు నిర్వహించడంలోని ఔచిత్యమేమిటో దాదా పు సదస్సు దేశాలన్నీ అర్థంచేసుకున్నాయి. దీంతో నిర్వాహకుల లక్ష్యం నెర వేరినట్లే వాతావరణ మార్పుల నేపథ్యంలో వివిధ దేశాలు తమ ప్రణాళికలు, ఆచరణ యోగ్యతలను ప్రకటిస్తారని అనుకున్న వారికి వాటి తాలూకు ఛాయలేవీ కనబడుటలేదు. అడవులు, మూల వాసుల రక్షణకు ఉష్ణమండల అరణ్యరక్షణకు 2500కోట్ల డాలర్ల నిధిని ప్రతిపాదించినా 660 కోట్ల డాలర్లను పొందగలిగింది. వాతావరణ ప్రకృతి సంరక్షణ నిధుల నుంచి పది శాతం వినియోగించుకునేందుకు సదస్సు అంగీకరించింది. చెప్పాలంటే సదస్సు నిర్వాహకులు తమ లక్ష్యాన్ని ఎంతో కొంత సాధించుకున్నట్లే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: