వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) ని జూలై 19న అరెస్ట్ చేసినట్టు సిట్ అధికారులు ప్రకటించారు. లిక్కర్ స్కాంలో దర్యాప్తు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అరెస్ట్ (Arrest) చర్చకు దారితీసింది. ఏపీకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత పాలనలో జరిగిన మద్యం కుంభకోణాలపై దర్యాప్తు ముమ్మరమైంది. ఇందులో భాగంగా మిథున్ రెడ్డిపై కళ్లేశిన సిట్, కీలక ఆధారాలతో ముందుకు సాగింది.ఈ కేసులో మిథున్ రెడ్డి పేరు ఏ4 నిందితుడిగా ఉంది. మద్యం పాలసీ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించినట్టు సిట్ తేల్చింది. విధ్వంసాత్మక నిర్ణయాలతో ప్రభుత్వానికి నష్టమేకాకుండా, ప్రైవేట్ సంస్థలకే లాభాలు కలిగేలా పాలసీ రూపొందించారని ఆరోపణలు ఉన్నాయి. దీన్ని నిర్ధారించేందుకు సిట్ విచారణను తీవ్రంగా చేపట్టింది.

7 గంటల విచారణ అనంతరం అరెస్ట్
ఇవాళ ఉదయం విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని సిట్ సుమారు ఏడు గంటల పాటు ప్రశ్నించింది. అనేక కీలక ప్రశ్నలకు అస్పష్ట సమాధానాలే ఇవ్వడంతో అధికారులు అరెస్ట్‌కి పాల్పడ్డారు. ఆయన అరెస్ట్ విషయాన్ని కుటుంబానికి అధికారికంగా తెలియజేశారు.
కోర్టుల్లో ఎదురుదెబ్బలు
ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ, రెండూ తిరస్కరించబడ్డాయి. దీంతో ఆయన అరెస్ట్ ఖాయమైపోయినట్టైంది. ఈ పరిణామంతో కేసు మరింత వేగం పుంజుకునే అవకాశముంది.
ఇతర కీలక నిందితులు
ఈ కేసులో ఏ1గా రాజ్ కసిరెడ్డి, ఏ2గా వాసుదేవరెడ్డి, ఏ3గా సత్యప్రసాద్ ఉన్నారు. అంతేకాదు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా ఈ కేసులో సంబంధముందని సమాచారం. తాను విజిల్ బ్లోయర్‌ని అంటున్న ఆయనపై కూడా ఎఫ్ఐఆర్‌లో వివరణ ఉంది.
Read Also : Chandrababu : 2019 ఎన్నికల ముందు నేను మోసపోయాను : చంద్రబాబు