ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) పై విచారణ వేగంగా సాగుతోంది. ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరుతూ సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన వెంటనే, సిట్ చర్యలకు దిగింది.అయితే కోర్టు వారు ఆశించిన విధంగా స్పందించలేదు. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు, కీలకమైన పత్రాలు జత చేయలేదని గమనించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మెమో సహా కీలక ఆధారాల్లేకుండా పిటిషన్ దాఖలు చేయడాన్ని తప్పుపడింది. దీంతో పిటిషన్‌ను తిరిగి సిట్‌కు పంపింది.

ముందస్తు బెయిల్ నిరాకరణ తర్వాత తలదాచుకున్న ఎంపీ
మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ నిరాకరణ ఎదురైంది. అనంతరం సుప్రీంకోర్టుకెళ్లిన ఆయనకు అక్కడ కూడా బెయిల్ లభించలేదు. దీంతో మిథున్ రెడ్డి కనిపించకుండా పోయారు. దేశం విడిచి పారిపోవద్దనే ఉద్దేశంతో సిట్ అధికారులు లుకౌట్ నోటీసు జారీ చేశారు.
సోదాలకు సిద్ధమైన సిట్
ముందస్తు బెయిల్ నిరాకరణతో సిట్ మరింత యాక్టివ్ అయింది. ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలకు సిద్ధమవుతోంది. చట్టపరంగా అరెస్ట్ చేయడానికి అవసరమైన న్యాయ పత్రాలతో ఏసీబీ కోర్టును ఆశ్రయించినా, పత్రాలు అసంపూర్తిగా ఉండటంతో కోర్టు పిటిషన్ తిరస్కరించింది.
తిరిగి కోర్టును ఆశ్రయించనున్న సిట్
ఇప్పుడు సంబంధిత పత్రాలతో కూడిన పిటిషన్‌ను మళ్లీ దాఖలు చేయాలని సిట్ సిద్ధమవుతోంది. మిథున్ రెడ్డి ఎక్కడున్నారన్న దానిపై స్పష్టత లేకపోవడంతో విచారణ మరింత గందరగోళంగా మారింది. ముందస్తు బెయిల్ లభించకపోవడం, కోర్టు నిరాకరణలు… ఇవన్నీ కలిపి ఈ కేసు రాజకీయంగా తీవ్ర దుమారం రేపే అవకాశముంది.
Read Also : AP Liquor Case : ఛార్జ్ షీట్ దాఖలుకు సిట్ రెడీ!