విజయవాడ : రాష్ట్రంలో డీ అడిక్షన్(De-addiction)(మత్తు ప్రభావ విమోచన) కేంద్రాల బలోపేతానికి రూ.33.80 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జిల్లా, బోధనా సుపత్రుల్లో గల 21 కేంద్రాల్లో వైద్యపరికరాలు, మందులు, మోళిక సదుపాయాల కల్పన, సాంకేతిక వ్యవస్థను మెరుగుపరచడం, సిబ్బందికి ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ నుంచి ఎక్సైజ్ శాఖకు ప్రతిపా దనలు వెళ్లాయి.
Read Also: Indiramma illu:20 రోజుల్లో పూర్తి – కొత్త టెక్నాలజీతో నిర్మాణం

21 కేంద్రాల ద్వారా వ్యసనాల బారిన పడినవారిని ఆ మాదక ద్రవ్యాలు(Drugs) తీసుకోవడంతో పాటు ఇతర వ్యసనాల నుంచి బయటకు తెచ్చి సన్మార్గంలో నడిచే విధంగా కూటమి ప్రభుత్వం
కృషి చేస్తుందని జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్యాదవ్ ఇటీవల తెలిపారు. యువత వ్యసనాలకుదూరంగా ఉండాలని, చెడు సహవాసాలు చేయవద్దని, ఆరోగ్య సంరక్షణ, విలువలు ముఖ్యమని పేర్కొన్నారు. ఈ విమోచన కేంద్రాల ద్వారా వ్యసనాలకు గురైనవారికి నిపుణుల ద్వారా చికిత్స, ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశం వ్యసనాలకు గురైనవారికి కొత్త జీవితం ప్రసాదించడమేనని తెలిపారు. 2023-24లో 18147మందిఇన్ పేషెంట్లు ఉండగా 2024 నుంచి సెప్టెంబర్ 2025నాటికి 22909 మంది ఇన్ పేషెంట్లుగా సేవలు పొందారని గుర్తు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: