నెల్లూరు రూరల్ : రాష్ట్రంలోనే,సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పూర్తిచేసిన నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ కి, యువ నాయకుడు నారా లోకేష్కి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే చాలా ఇష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్, ఐపిఆర్ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి (Minister Partha Saradhi) తెలిపారు.
ఒకేఒక్క శాసనసభ్యుడు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్, వడ్డిపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం, 85 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్, ఐ పి.ఆర్. శాఖా మంత్రి కొలుసు పార్థసారధి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్లు శంకుస్థాపన చేసారు. సంవత్సర కాలంలో రాష్ట్రంలో 268 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసిన ఒకేఒక్క శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్, ఐపి.ఆర్. శాఖామంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు.

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రాష్ట్రంలోనే
ప్రజలకు సేవచేయాలన్న తాపత్రయం ఉన్న వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్, ఐ పి.ఆర్. శాఖామాత్యులు కొలుసు పార్థసారధి. కార్యకర్తల కష్టంతోనే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రాష్ట్రంలోనే మొదటి స్థానం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని అన్నారు. కూటమి ప్రభుత్వం (A coalition government) అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 17వ డివిజన్ అభివృద్ధికి 3 కోట్ల 60 లక్షల నిధులు కేటాయించామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జులు, కో క్లస్టర్ ఇంచార్జులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కొలుసు పార్ధసారధి గారి జీవితం గురించి చెప్పండి?
కొలుసు పార్ధసారధి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్‌లో హౌసింగ్ మరియు ఇన్‌ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ (IPR) శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. తెనాలి నియోజకవర్గానికి చెందిన ఆయన, తెలుగుదేశం పార్టీ (TDP) కీలక నాయకుల్లో ఒకరు.
రాజకీయాల్లోకి ఆయన ప్రవేశం?
చిన్ననాటి నుంచే సామాజిక సేవా రంగంలో ఆసక్తి కలిగి ఉన్న ఆయన, రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజాసేవను తన ధ్యేయంగా మార్చుకున్నారు. టీడీపీలో ఆయనకు నమ్మకమైన నాయకుడిగా గుర్తింపు ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Tirumala: టైమ్ స్లాట్ టోకెన్ భక్తులకు గదులు ఇవ్వరు!