ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ (Minister Lokesh) డిసెంబర్ 6 నుంచి 10 వరకు అమెరికా, కెనడా పర్యటనలో ఉండనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన లక్ష్యం రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడం. రాష్ట్ర పారిశ్రామిక విధానలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న వాతావరణం గురించి విదేశీ కంపెనీలకు వివరణ ఇవ్వడానికి లోకేశ్ వివిధ సమావేశాల్లో పాల్గొంటున్నారు.
Read Also: AP: క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
ఆత్మీయ స్వాగతం
డాలస్ చేరుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌కు (Minister Lokesh) అక్కడ ఘన స్వాగతం లభించింది. అక్కడి తెలుగు ప్రవాసాంధ్రులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా లోకేశ్ పర్యటన సాగనుంది. డాలస్‌లో లోకేశ్ నేడు తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొంటారు.

అనంతరం రేపు, ఎల్లుండి శాన్‌ఫ్రాన్సిస్కోలోని గూగుల్ సహా పలు ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. 10న కెనడాలోని టొరంటోలో ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశమై అదేరోజు రాత్రి కెనడా నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. 11న ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లి సీఎం చంద్రబాబుతో కలిసి కాగ్నిజెంట్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: