తూర్పుగోదావరి జిల్లా : ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 43 ఇసుక రీచ్ లు ఉన్నాయని, వాటి ద్వారా ఇప్పటి వరకు 25 లక్షల టన్నుల ఇసుకను అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని మైన్స్ శాఖల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read also: Tirumala: పరకామణి కేసులో ఊహించని పరిణామం!
ఈ సమావేశంలో జిల్లాస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఇసుక సరఫరా అక్రమ కార్యకలాపాల నివారణ, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధిని ప్రధాన లక్ష ్యంగా తీసుకుని క్రమబద్ధమైన విధానాలతో ముందుకు సాగుతోందన్నారు. ఇటీవల నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ మీట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం ప్రభుత్వంపై దేశ, విదేశీ పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని తెలిపారు.

విదేశీ పెట్టుబడుల్లో సుమారు 25 శాతం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో వేగంగా ముందుకు సాగుతోందని, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంత్రి గణాంకాలను ప్రస్తావిస్తూ, గత ఏడాది కాలంలో దేశానికి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో సుమారు 25 శాతం ఆంధ్రప్రదేశకు రావడం రాష్ట్ర పాలనపై ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు.
గనులు, ఇసుక రంగంలో పారదర్శక విధానాల ద్వారా రాష్ట్రం లో ఇప్పటికే 25 లక్షల టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చామని, అందులో 10 లక్షలు ఇక్కడ నుండి అందుబాటులో తీసుకుని రావడం జరిగింది అని తెలిపారు. గోదావరి జిల్లాల్లో 43 కొత్త ఇసుక రీచులు పనిచేస్తున్నాయని తెలిపారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో ఇసుక ధరలు అధికంగా ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వ విధానాల వల్ల గణనీయంగా ధరలు తగ్గాయని వివరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: