విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ (యుద్ధ కళలు) రంగంలో అత్యంత అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్(Minister Durgesh) హర్షం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన చూపిన క్రమశిక్షణ, సాధన, పరిశోధన, అంకితభావానికి నిదర్శనంగా జపాన్ కు చెందిన గోల్డెన్ డ్రాగెన్ సంస్థ ద్వారా టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు దక్కడం పట్ల ప్రత్యేక అభినందనలు తెలిపారు. సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ పై ప్రత్యేక మక్కువ పెంచుకున్నారని, చెన్నైలో కరాటే, వివిధ యుద్ధ కళలపై ఆయన చేసిన కఠోర సాధన నేడు ఈ అరుదైన ఘనతకు పునాది వేసిందని వివరించారు.
Read also: AP: డిప్యూటీ సీఎం పవన్‌కు అభినందనలు తెలిపిన మంత్రి లోకేశ్

పురాతన జపనీస్ కత్తిసాము కళ అయిన ఖకెంజుట్సు లో జనసేనాని పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రవేశం పొందడం విశేషమని, తమ్ముడు, ఖుషి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అన్నరం, ఇటీవల విడుదలైన ఓజీ చిత్రాల్లో ఈ తరహా కళలను ప్రదర్శించారని గుర్తుచేశారు. ప్రపంచస్థాయిలో అత్యంత క్లిష్టమైనదిగా భావించే ఈ విద్యలో ఆయన సాధించిన ప్రగతి గర్వకారణమన్నారు. మూడు దశాబ్దాల పాటు ఒక విద్య పట్ల నిలకడగా, అంకితభావంతో సాధన చేయడం ఆయనలోని పట్టుదలకు, క్రమశిక్షణకు నిదర్శనమని మంత్రి దుర్గేష్(Minister Durgesh) కొనియాడారు. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ బిజీగా ఉంటూనే తనకిష్టమైన యుద్ధ కళల్లో నిరంతరం సాధన చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి నిదర్శనమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: