हिन्दी | Epaper
అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం

ఏపీలో మగవారికీ పొదుపు సంఘాలు.. నిబంధనలు ఇవే

Sudheer
ఏపీలో మగవారికీ పొదుపు సంఘాలు.. నిబంధనలు ఇవే

ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే పరిమితమైన పొదుపు సంఘాలను ఇప్పుడు మగవారికీ విస్తరించేందుకు మెప్మా (MEPMA) చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. తొలి దశలో 2,841 పొదుపు సంఘాలను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే నెల రోజుల్లోనే 1,028 గ్రూపులు స్థాపించబడ్డాయి.

ఈ పొదుపు సంఘాలు ముఖ్యంగా రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా ఉపయోగపడతాయి. వీటివల్ల చిన్న మొత్తాల పొదుపుతో పాటు, ప్రభుత్వ ప్రోత్సాహక నిధులను కూడా పొందే అవకాశం ఉంటుంది. మార్చి 31 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి లక్ష్యాన్ని సాధించాలని అధికారులు యత్నిస్తున్నారు.

పొదుపు సంఘాలలో చేరాలనుకునే పురుషులకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. 18-60 ఏళ్ల వయస్సు ఉండాలి. కనీసం ఐదుగురు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడాలి. గ్రూపు సభ్యుల వద్ద ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉండడం తప్పనిసరి. సభ్యులు నెలకు కనీసం రూ. 100 నుంచి రూ.1,000 వరకు పొదుపు చేయాల్సి ఉంటుంది.

Men's Savings Societies in

ఈ పొదుపు సంఘాల్లో సభ్యులు చేరిన ఆరు నెలల తర్వాత రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం రూ.25,000 సహాయంగా అందజేస్తుంది. ఈ నిధిని ఉపయోగించి గ్రూపు అభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని క్రమంగా పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.

గ్రూపు ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారు మెప్మా కార్యాలయ సిబ్బందిని సంప్రదించి సభ్యత్వం పొందవచ్చు. ఈ పథకం ద్వారా చిన్న స్థాయిలో పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని పొందేందుకు పురుషులకు కొత్త అవకాశం లభించనుంది. దీంతో అనేక మంది కూలీల జీవితాల్లో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870